అన్వేషించండి
Advertisement
Anchor Suma: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.. ఆ వ్యాధితో బాధపడుతున్న సుమ..
ఓపక్క టీవీ షోలు, ఈవెంట్స్ తో పాటు ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది సుమ.
యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె అంత ఫేమస్. బుల్లితెరపై మహారాణిలా దూసుకుపోతున్న ఈమె పలు టీవీ షోలు, ఈవెంట్స్ తో చాలా బిజీగా గడుపుతుంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది సుమ. ఏ స్టార్ హీరో ఈవెంట్ అయినా.. కచ్చితంగా సుమ హోస్ట్ చేయాల్సిందే. ఆమె కోసం దర్శకనిర్మాతలు ఆడియో ఫంక్షన్స్ డేట్స్ మార్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓపక్క టీవీ షోలు, ఈవెంట్స్ తో పాటు ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది.
అయితే తాజాగా ఈమె విడుదల చేసిన ఓ వీడియో షాకింగ్ విషయాలను వెల్లడించింది. చాలా దాచిపెట్టిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తను కీలాయిడ్ టెండెన్సీ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నానని.. అంటే ఏదైనా గాయమైతే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కన కూడా వ్యాపిస్తుందని చెప్పుకొచ్చింది. దీన్ని పోగొట్టుకోవడానికి చాలానే చేశానని.. కానీ ఫలితం లేదని.. ఇది తన శరీరంలో భాగమైపోయింది తెలిపింది.
గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పుడు మేకప్ ఎలా వేసుకోవాలి..? ఎలా తీసేయాలి..? వంటివి తెలియక మొత్తం జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఉన్నదాన్ని వస్తున్నానని తెలిపింది. సాధారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తామని.. కానీ అది మన శరీరంలోకి ఉంటుందని తెలిసినప్పుడు దానిని అంగీకరించాలని.. అప్పుడే మనం సంతోషంగా ఉండగలమని చెప్పుకొచ్చింది.
Also Read: నాకు డ్రామాలాడడం రాదు.. సిరిపై యానీ మాస్టర్ ఫైర్..
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion