అన్వేషించండి

Sreemukhi: అలా చేయలేక.. ఇండస్ట్రీలో ఉండనని ఏడ్చేశా.. శ్రీముఖి షాకింగ్ కామెంట్స్, ప్రదీప్‌తో పెళ్లిపై క్లారిటీ!

యాంకర్ శ్రీముఖి ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యలు గురించి ఓ ఇంటర్వూలో తెలిపింది. ప్రదీప్‌తో పెళ్లి గురించి వస్తున్న వదంతులపై కూడా స్పందించింది.

యాంకర్ శ్రీముఖి గురించి తెలియనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఆమె బుల్లి తెరపై కనిపించినా లేకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ‘పటాస్’ కార్యక్రమంతో మంచి యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం ఏర్పరుచుకుంది. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్ట్స్’లో శ్రీముఖీ యాంకరింగ్ చేస్తూ అలరిస్తోంది. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శ్రీముఖి ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుల్లితెర పరిశ్రమలో తనకు ఎదురైన సవాళ్లు గురించి చెప్పుకొచ్చింది. 

యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి సమాధానమిస్తూ.. ‘‘వరుస షోలతో చాలా ఇబ్బందిగా ఉండేది. దీంతో మా నాన్నగారికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి.. నేను ఈ ఇండస్ట్రీలో ఉండనని చెప్పేశాను. నాకు ఈ ఇండస్ట్రీ వద్దు.. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారని ఏడ్చేశాను. నిద్రపోవడానికి కూడా టైమ్ ఉండేది కాదు. యాంకరింగ్ చేయడానికి రోజంతా నిలబడే ఉండాల్సి వచ్చేది. హీల్స్ వేసుకుని నిలుచోవాలి. ఏది పడితే ఆ డ్రస్ వేసుకోవడానికి కుదిరేది కాదు. నేను గ్లామరస్ దుస్తులు వేసుకోవాలని డైరెక్టర్లు ఎక్స్‌‌పెక్ట్ చేసేవారు. ‘పటాస్’ కోసం రోజూ రెండు మూడు ఎపిసోడ్లు నిలబడే పనిచేశాను. ఎప్పుడో తప్ప కూర్చోడానికి సమయం దొరికేది కాదు. ‘గోల్డ్ రష్’ ఎపిసోడ్‌ కూడా రోజుకు నాలుగు, ఐదు ఎపిసోడ్లు చేసేదాన్ని. సుమారు గంట గంటన్నర సేపు నిలబడటం వల్ల కాళ్లు తిమ్మిరెక్కిపోయాయి. అలాంటి సమయంలో గొడ్డు చాకిరీ ఎందుకు చేయాలా అని అనిపించేది. ఆ తర్వాత క్రమేనా నేను చేసే పనిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ప్రేక్షకులకు దగ్గరకావడంతో ఇష్టపడి పనిచేస్తు్న్నా’’ అని తెలిపింది.

ప్రదీప్‌తో ప్రేమ.. పెళ్లిపై వస్తున్న వందతులపై కూడా శ్రీముఖి స్పందించింది. ప్రదీప్‌తో ఏం నడుస్తోంది? అనే ప్రశ్నకు శ్రీముఖి బదులిస్తూ.. ఆ ప్రశ్నను క్వశ్చన్ మార్కుతో వదిలేస్తేనే బెటర్ అని తెలిపింది. ‘‘మేం సుమారు పదేళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నాం. పైగా నేను చేసిన ఫస్ట్ షో ‘అదుర్స్’లో నా కో-యాంకర్ ప్రదీప్.  తాజాగా ‘జీ తెలుగు’లో ‘చీ.ల.సౌ శ్రీముఖి, చిరంజీవి ప్రదీప్’ అనే ఈవెంట్ చేశాం. దానివల్ల మా మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. టీవీల్లో కొన్ని జంటలకు ఫాలోయింగ్ ఉంటుంది. ఇది కూడా అంతే. దీని గురించి నేను, ప్రదీప్ కూడా చాలా సార్లు చెప్పాం. అది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేస్తున్నా. మాకైతే దీనిపై క్లారిటీ ఉంది’’ అని శ్రీముఖి తెలిపింది.

Also Read: తన బాధ్యత నాదే.. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అదే, రష్మీ భావోద్వేగం.. సుధీర్ గుడ్ న్యూస్!  

Also Read: బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget