By: ABP Desam | Updated at : 04 Feb 2022 06:32 PM (IST)
చంద్రకళగా అనసూయ, ఎంత పద్దతిగా ఉందో
యాంకర్ అనసూయ బుల్లితెరపై పలు టీవీ షోలతో బిజీగా ఉన్నా.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ.. తన క్రేజ్ ను పెంచుకుంటుంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో దాక్షాయణి క్యారెక్టర్ లో కనిపించింది ఈ బ్యూటీ. డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ.. తన నటనతో ఆకట్టుకుంది. 'పుష్ప' పార్ట్ 2లో అనసూయ రోల్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలో నటించింది. ఇందులో ఆమె చంద్రకళ అనే క్యారెక్టర్ పోషిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చీర కట్టుకొని, సిగ్గుపడుతూ కనిపించింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషిస్తుందని.. హీరోయిన్ తల్లి క్యారెక్టర్ లో, హీరోకి అత్తగా కనిపిస్తుందని ఇలా ఆమె పాత్రకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అనసూయ గెటప్ చూస్తుంటే.. తల్లి క్యారెక్టర్ చేసేలా కనిపించడం లేదు. త్వరలోనే ఆమె రోల్ పై క్లారిటీ రానుంది.
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, హవీష్ నిర్మించిన ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఏపీలో ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇది సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుందేమో చూడాలి!
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ
Keema Recipe: దాబా స్టైల్లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం