By: ABP Desam | Updated at : 01 May 2023 01:35 PM (IST)
Edited By: anjibabuchittimalla
‘విమానం‘ సినిమాలో అనసూయ (Photo Credit: Zee Studios South/twitter)
సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మేడే(మే1న) సందర్భంగా చిత్ర బృందం సరికొత్త అప్ డేట్ ఇచ్చింది. అనసూయకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా పోస్టర్లను రిలీజ్ చేసింది. ఎర్ర రంగు జాకెట్, పూల పూల చీరలో చక్కటి చిరునవ్వుతో అనసూయ ఆకట్టుకుంటోంది. చేతికి ఎర్రని గాజులు, ముక్కుకు ముక్కెర, కాళ్లకు పట్టీలు పెట్టుకుని ఇంటి ముందు అరుగు మీద కూర్చుని స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
She is strong & courageous with utmost inner belief ❤️
— Zee Studios South (@zeestudiossouth) May 1, 2023
The dazzling @anusuyakhasba is ready to swoon you in #VIMANAM ✈️
- https://t.co/IZ8n3XD46E#HappyMayDay
Landing in your nearest theatres on June 9th🎥@thondankani #Meerajasmine @eyrahul @DhanrajOffl #SivaPrasadYanala pic.twitter.com/sis6BHLN6i
'విమానం' సినిమాలో తొలి పాట 'రేలా రేలా...'ను మే 2న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన పాటలో సముద్రఖనిని వికలాంగుడిగా చూపించారు.
The Heartwarming 1st single #RelaRela | #YeleYele from #VIMANAM will be out on May 2nd @ 3:00 PM 🤗
— Zee Studios South (@zeestudiossouth) April 29, 2023
Stay tuned ⏳
Landing in your nearest theatres on June 9th🎥@thondankani @anusuyakhasba #Meerajasmine @eyrahul @DhanrajOffl #SivaPrasadYanala @KkCreativeWorks @lemonsprasad… pic.twitter.com/WP6O2n12zP
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. ‘విమానం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సముద్రఖని ఫస్ట్ లుక్, ప్రోమో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని అర్థం అవుతోంది. అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా కన్న కుమారుడిని జాగ్రత్తగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రలో సముద్రఖని నటించారు. ప్రోమోలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.
''జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ఈ 'విమానం'. తండ్రి కుమారుల అనుబంధంతో పాటు ఎన్నో మంచి అంశాలు మా సినిమాలో ఉన్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందట. ప్రోమోకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది.
Read Also: ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన మహేష్ బాబు, దాని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవ్వాల్సిందే!
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
The Kerala Story: కమల్ హాసన్ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్
Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12
NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్ పథకం ఇస్తుంది!