బాలీవుడ్ హీరోల్లో వాళ్లే నా రోల్ మోడల్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్
వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన రిమేక్ 'ఛత్రపతి'లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ గ్రేట్ ఎక్స్ పీరియన్స్ పొందుతురాని బెల్లంకొండ విశ్వాసం వ్యక్తం చేశారు.
Chatrapathi : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో 2005లో రిలీజైన 'ఛత్రపతి' బ్లాక్ బస్టర్ అయ్యి, రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు రిమేక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నుస్రత్ భరుచా కథానాయికగా నటించిన ఈ సినిమా.. మే 12న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ హీరో బెల్లంకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మూవీని స్టార్ట్ చేసినపుడు ఓ రిమేక్ మూవీని తీస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి చేశామని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. 2005లో తెలుగులో వచ్చిన మూవీని ప్రస్తుతం తాము రీక్రియేట్ చేయాలని ప్రయత్నించామని తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గ్రేట్ ఎక్స్ పీరియన్స్ పొందాలని తాము మూవీని ప్రారంభించినపుడే నిశ్చయించుకున్నామని బెల్లంకొండ అన్నారు. తనకు తెలిసి 99.9 శాతం మంది ఈ సినిమా చూడాలని అనుకోరన్నారు. తాము కూడా ఓ రిమేక్ ఫిల్మ్ చేస్తున్నామన్న ఆలోచన లేకుండా చేశామని, కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ మంచి ఎక్స్ పీరియన్స్ ఫీలవుతారని తాను గ్యారంటీగా చెప్పగలనని ఆయన స్పష్టం చేశారు.
హిందీ హీరోలలో తనకు రోల్ మోడల్ ఎవరన్న ప్రశ్నకు బెల్లంకొండ చాలా డిప్లమాటిక్ గా సమాధానమిచ్చారు. తన బాలీవుడ్ లో అందరూ రోల్ మోడల్ గానే అనిపిస్తారని, ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అన్న ఫీలింగ్ ఏం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంటుందన్నారు. అమీర్ ఖాన్ ను తీసుకుంటే.. ఆయన సెలక్ట్ చేసుకునే కంటెంట్ ను చూస్తే.. చాలా అమేజింగ్ గా అనిపిస్తుందని బెల్లంకొండ తెలిపారు. సల్మాన్ ఖాన్ సినిమాలైతే కంటెంట్ లేకపోయినా.. ఆయన సినిమాలు చూడాలనిపిస్తుందన్నారు. షారుఖ్ ఖాన్ గురించి చెప్పాలంటే.. ఆయన సినిమాల్లో కంటెంట్, సెలక్షన్... రెండూ బాగుంటాయని చెప్పారు. ఇటీవల రిలీజైన ఆయన సినిమా పఠాన్ గురించి ప్రస్తావించిన బెల్లంకొండ.. ఆయన యాక్షన్ అమేజింగ్ గా అనిపించిందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరి నుంచీ నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుందని ఆయన అన్నారు.
ఇక హిందీ రిమేక్ 'ఛత్రపతి' సినిమా విషయానికొస్తే.. ఇటీవల రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు. డైలాగులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో అప్పట్లో విడుదలైన 'ఛత్రపతి' సినిమా బ్యాక్ డ్రాప్ ని మార్చి, యాక్షన్ ఎంటర్ టైనర్ గా హిందీ 'ఛత్రపతి'ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో భాగ్యశ్రీ, శరద్ కేల్కర్, శివం పాటిల్ ... తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా మారుతుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్