Allu Arjun: పార్టీ ఇచ్చావా పుష్పా - సక్సెస్ పార్టీ ఇచ్చిన బన్నీ మామయ్య!
పుష్ప విజయానికి అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సెలబ్రేట్ చేశారు.
అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదల అయి మూడు నెలలు అవుతున్నా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సెలబ్రేట్ చేశారు.
ఈ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు టి.సుబ్బరామిరెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, బుచ్చిబాబు, క్రిష్ జాగర్లమూడి, మైత్రి మూవీస్ నిర్మాత వై.రవిశంకర్, సీఈవో చెర్రీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినిమా దర్శకుడు సుకుమార్ పర్సనల్ వెకేషన్‌లో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు.
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram
Bunny and Trivi..🔥#AlluArjun #PushpaTheRule pic.twitter.com/LjIZTwYhdQ
— Arjun 🪓 (@ArjunVcOnline) March 21, 2022
Felicitation ceremony of Hero Allu arjun for blockbuster success of Pushpa..Allu arjun uncle (Allu arjun wife snehareddy’s father) Shekarreddy organised this felicitation event yesterday in Hyderabad #pushpa#alluarjun #pushpaTherule pic.twitter.com/yAPQOBIUom
— Maduri Mattaiah (@madurimadhu1) March 20, 2022