Unstoppable Season 4: అన్ స్టాపబుల్ సీజన్ 4 రెడీ - ఈ సారి గెస్టులు ఎవరంటే?
మూడు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించి బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. త్వరలో ప్రారంభం కాబోయే ఈ సీజన్ లో పలువురు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Unstoppable Season 4 Guests: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్నది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. బాలయ్య వారిని సరదా సరదాగా ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. తొలి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్’ నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. ఈ నెల 24 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది.
నాలుగో సీజన్ లో స్టార్ హీరోల సందడి
‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయని ఇప్పటికే బాలయ్య చెప్పారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ షో రెడీగా ఉందన్నారు. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో పలు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలి ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప 2’ టీమ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేలితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలో ఈ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
దసరా సందర్భంగా ప్రోమో విడుదల
దసరా పండుగ సందర్భంగా ‘అన్ స్టాపబుల్’ షోకు సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న యానిమేషన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో బాలయ్య సూపర్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్ లో బాలయ్య సినిమాల్లో మాదిరిగానూ డైలాగులు చెప్తూ ఆకట్టుకున్నాడు. కన్నెర్రజేస్తే ప్రళయం, మీసం తిప్పితే శత్రువుల మరణం, మాటే శాసనం అంటూ పవర్ ఫుల్ డైలాగులతో ఆహా అనిపించారు. జనరేషన్ మారినా ఎమోషన్ మారదు, దెబ్బకి థింకింగ్ మారాలంటూ బాలకృష్ణ నోటి వెంట వచ్చిన డైలాగులు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. గత మూడు సీజన్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకన్న ఈ షో నాలుగో సీజన్ లో అంతకు మించి అనేలా ఉంటుందంటున్నారు షో నిర్వాహకులు.
బాలయ్య సినిమాల గురించి..
బాలయ్య తాజాగా ‘అఖండ 2’ సినిమాను అనౌన్స్ చేశారు. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘అఖండ 2: తాండవం’ అనే పేరును ఖరాలు చేశారు. అటు ప్రస్తుతం బాలయ్య, దర్శకుడు బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ దీపావళికి టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే