Alia-Ranbir Welcome Baby : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా - రణ్‌బీర్ ఇంట సంబరాలు
Alia Bhatt Ranbir Kapoor Welcomes Baby Girl : కపూర్ - భట్ కుటుంబాలు సంబరాలు మొదలు పెట్టాయి. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ సతీమణి, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ రోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
![Alia-Ranbir Welcome Baby : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా - రణ్‌బీర్ ఇంట సంబరాలు Alia Bhatt Ranbir Kapoor Baby welcome baby Reliance foundation hospital Mumbai first baby Alia-Ranbir Welcome Baby : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా - రణ్‌బీర్ ఇంట సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/befa76a4aef44632693a753606a4e8991667719473845313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కపూర్ - భట్ కుటుంబాలు సంబరాలు మొదలు పెట్టాయి. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ సతీమణి, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ రోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు అమ్మాయి జన్మించింది. ఆలియా భట్ (Alia Bhatt) ను తీసుకుని సౌత్ ముంబైలోని గిరిగావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) వెళ్లారు. ఈ నెలాఖరున ఆలియా భట్ డెలివరీ కావచ్చని, డెలివరీ డేట్ నవంబర్ 28 అని డాక్టర్లు చెప్పారని ముంబై నుంచి వార్తలు వచ్చాయి. అయితే... వైద్యులు చెప్పిన సమయం కంటే ముందుగా బిడ్డ భూమి మీదకు వచ్చింది.
రిషి కపూర్‌కు కూడా ముందు అమ్మాయే!
Alia Bhatt and Ranbir Kapoor Blessed with Baby Girl : రణ్‌బీర్ కపూర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు కూడా ముందు అమ్మాయి జన్మించింది. రణ్‌బీర్ కంటే ముందు రిద్ధిమాకు నీతు జన్మనిచ్చారు. రిషి తొలి సంతానం అమ్మాయి. ఇప్పుడు తండ్రిలా రణ్‌బీర్ తొలి సంతానం కూడా అమ్మాయే కావడం విశేషం. ఆలియా తండ్రి మహేష్ భట్ తొలి సంతానం కూడా అమ్మాయే.
పెళ్లికి ముందే ఆలియా గర్భవతి!?
ఈ ఏడాది ఏప్రిల్ 14న రణ్‌బీర్, ఆలియా ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత రెండు నెలలకు... అంటే జూన్‌లో తాను గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. తల్లి కాబోతున్న సంతోషాన్ని ఆలియా వ్యక్తం చేస్తే... చాలా మందిలో కొత్త సందేహాలు మొదలు అయ్యాయి. ఆమె ప్రకటన కొంత మందికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అని, అందువల్ల హడావిడిగా ఏడు అడుగులు వేశారని ముంబై జనాలు చెవులు కోరుకున్నారు.
గర్భవతి అయిన తర్వాత...
ఆలియా భట్ గర్భవతి అయిన తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. అందుకని, ఆ సినిమా వారిద్దరికీ ఎంతో స్పెషల్. గర్భవతి అయినా సరే తమ దంపతులకు స్పెషల్ సినిమా అయిన 'బ్రహ్మాస్త్ర'ను ప్రమోట్ చేయడానికి దేశంలో పలు నగరాలు తిరిగారు. జోరుగా, హుషారుగా ప్రచారం నిర్వహించారు. చిన్నారి భూమి మీదకు వచ్చిన తర్వాత తనతో ఎక్కువ సమయం గడపడం కోసం కొన్ని రోజులు షూటింగులు, సినిమా పనుల నుంచి విరామం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!
ప్రెగ్నెన్సీతోనే తాను హాలీవుడ్‌కు పరిచయం అవుతున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ చేశారు ఆలియా భట్. దాని కోసం లండన్ వెళ్లారు. ఆ సమయంలో 'హార్ట్ ఆఫ్ స్టోన్' యూకే షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఆమెను పికప్ చేసుకోవడానికి రణ్‌బీర్ ప్లాన్ చేస్తున్నారని, ఆలియా ప్రెగ్నెన్సీ వల్ల షూటింగులు ఆలస్యం అవుతున్నాయని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె మండిపడ్డారు. పికప్ చేసుకోవడానికి తాను ఏమైనా పార్సిలా? అని ప్రశ్నించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత హిందీలో ఆలియా భట్ నటించిన 'డార్లింగ్స్' విడుదల అయ్యింది. (Alia Bhatt Upcoming Movies) హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమా చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)