News
News
X

Alia-Ranbir Baby : ఏ క్షణమైనా డెలివరీ కావచ్చు - భార్యను తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన రణ్‌బీర్

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఏ క్షణమైనా ఆలియా డెలివరీ కావచ్చని తెలుస్తోంది.

FOLLOW US: 

ఆలియా భట్ (Alia Bhatt) ను తీసుకుని సౌత్ ముంబైలోని గిరిగావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి ర‌ణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) వెళ్లారు. 'ఆర్ఆర్ఆర్'తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సీత పాత్రలో పరిచయమైన ఆలియా, ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. ఏ క్షణమైనా ఆమెకు డెలివరీ కావచ్చని, పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారని ముంబై సమాచారం. 

ఈ నెలాఖరున ఆలియా భట్ డెలివరీ కావచ్చని, డెలివరీ డేట్ నవంబర్ 28 అని డాక్టర్లు చెప్పారని ముంబై నుంచి వార్తలు వచ్చాయి. అయితే... వైద్యులు చెప్పిన సమయం కంటే ముందుగా బిడ్డ భూమి మీదకు వస్తుందేమో!?

పెళ్లికి ముందే ఆలియా గర్భవతి!?
ఈ ఏడాది ఏప్రిల్ 14న ర‌ణ్‌బీర్, ఆలియా ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత రెండు నెలలకు... అంటే జూన్‌లో తాను గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. తల్లి కాబోతున్న సంతోషాన్ని ఆలియా వ్యక్తం చేస్తే... చాలా మందిలో కొత్త సందేహాలు మొదలు అయ్యాయి. ఆమె ప్రకటన కొంత మందికి స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అని, అందువల్ల హడావిడిగా ఏడు అడుగులు వేశారని ముంబై జనాలు చెవులు కోరుకున్నారు.

గర్భవతి అయిన తర్వాత...
ఆలియా భట్ గర్భవతి అయిన తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. అందుకని, ఆ సినిమా వారిద్దరికీ ఎంతో స్పెషల్. గర్భవతి అయినా సరే తమ దంపతులకు స్పెషల్ సినిమా అయిన 'బ్రహ్మాస్త్ర'ను ప్రమోట్ చేయడానికి దేశంలో పలు నగరాలు తిరిగారు. జోరుగా, హుషారుగా ప్రచారం నిర్వహించారు.
 
చిన్నారి భూమి మీదకు వచ్చిన తర్వాత తనతో ఎక్కువ సమయం గడపడం కోసం కొన్ని రోజులు షూటింగులు, సినిమా పనుల నుంచి విరామం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. 

News Reels

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ప్రెగ్నెన్సీతోనే తాను హాలీవుడ్‌కు పరిచయం అవుతున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ చేశారు ఆలియా భట్. దాని కోసం లండన్ వెళ్లారు. ఆ సమయంలో 'హార్ట్ ఆఫ్ స్టోన్' యూకే షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఆమెను పికప్ చేసుకోవడానికి ర‌ణ్‌బీర్ ప్లాన్ చేస్తున్నారని, ఆలియా ప్రెగ్నెన్సీ వల్ల షూటింగులు ఆలస్యం అవుతున్నాయని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె మండిపడ్డారు. పికప్ చేసుకోవడానికి తాను ఏమైనా పార్సిలా? అని ప్రశ్నించారు. 

'ఆర్ఆర్ఆర్' తర్వాత హిందీలో ఆలియా భట్ నటించిన 'డార్లింగ్స్' విడుదల అయ్యింది. హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమా చేస్తున్నారు. చిన్నారికి జన్మ ఇవ్వడానికి ముందు ఆమె ఖాతాలో హిట్ సినిమా ఉంది. చిన్నారికి జన్మ ఇచ్చిన తర్వాత వచ్చే సినిమా కూడా తప్పకుండా హిట్ అని బాలీవుడ్ చెబుతోంది. కరణ్ జోహార్ దర్శక - నిర్మాతగా, ఆలియా భట్ కథానాయికగా సినిమా చేస్తే ఫెయిల్ కావడం అరుదు అంటున్నారు. 

Also Read : 'ఆదిపురుష్'లో భారీ మార్పులు

Published at : 06 Nov 2022 09:51 AM (IST) Tags: Ranbir Kapoor Alia Bhatt Alia Bhatt Delivery Alia - Ranbir Baby Alia Bhatt Delivery Date

సంబంధిత కథనాలు

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై