Lehenga Fashion: గోల్డెన్ లెహెంగాలో అలియా భట్... పెళ్లి కళ వచ్చేసిందిగా
లెహెంగా ఫ్యాషన్ నడుస్తోంది. పెళ్లిలో కూడా ఇప్పుడు వీటికే ప్రాముఖ్యత.
దక్షిణ భారతదేశంలో పెళ్లికి పట్టు చీరలు కట్టుకుంటుంది వధువు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం భారీ వర్క్ తో కూడిన లెహెంగాలనే ధరిస్తారు పెళ్లి కూతుళ్లు. ఆ లెహెంగా ఫ్యాషన్ భారతదేశమంతా పాకింది ఇప్పుడు. మన దగ్గర రిసెప్షన్లో లెహెంగాలు వేసుకునే వారి సంఖ్య పెరిగింది. బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా ఓ బంగారు రంగు లెహెంగాలో మెరిసింది. రిసెప్షన్లకు, ఎవరి పెళ్లిళ్లకైనా హాజరయ్యేందుకు కూడా ఈ లెహెంగా రిచ్ లుక్ ఇస్తుంది. అలియా భట్ వేసిన ఈ లెహెంగాను రూపొందించిది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి.
View this post on Instagram
అలియా తన రాబోయే సినిమా, మోస్ట్ ఎవైటడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసం ఆమె ఈ గోల్డెన్ లెహెంగాను ధరించింది. ఈ లెహెంగాను మిర్రర్ వర్క్ తో, బంగారు అంచుతో, పైస్లీ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. హైవెస్ట్ లెహెంగా ఇది. కేవలం అలియాకే అమ్మాయిలు ఎవరికైనా ఇది చక్కగా అమరిపోతుంది. అలియా పెట్టుకున్న చెవిపోగులు కూడా సబ్యసాచి హెరిటేజ్ జ్యువెలర్ కలెక్షన్‌కు చెందినవే. అలియా భట్ మీకు కూడా నచ్చి ఉంటే.. మీరు కూడా ఫాలో అవ్వచ్చు.
View this post on Instagram
Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు
Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?