News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Salaar Film: ‘సలార్’కు ‘కేజీఎఫ్’కు లింక్ - ఇదిగో ప్రూఫ్ అంటూ మీమ్స్‌!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. జులై 6న ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’, ‘సలార్’కు లింక్ పెడుతూ నెట్టింట్లో మీమ్స్ హోరెత్తుతున్నాయి.

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ   ‘సలార్’. చాలా రోజులుగా ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, ఓ రేంజిలో వైరల్ అవుతోంది.   

‘సలార్’కు ‘కేజీఎఫ్2’కు లింక్!

త్వరలో ‘సలార్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని ప్రకటించారు.  జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు ‘సలార్’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నెట్టింట్లో ఈ సినిమా గురించి జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు, ‘సలార్’ సినిమాను ‘కేజీఎఫ్2’ చిత్రంతో లింక్ పెడుతూ నెటిజన్లు జోరుగా మీమ్స్ చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ‘కేజీఎఫ్2’లో రాఖీ భాయ్ చనిపోయే సమయం, తాజా మూవీ ‘సలార్’ టీజర్ రిలీజ్ టైమ్ ఒకటే కావడం విశేషం. రాఖీ భాయ్ తన దగ్గర ఉన్న మొత్తం బంగారంతో షిప్‌లో సముద్రంలోకి వెళ్తారు. తుఫాన్ లో చిక్కుకుని షిప్ మునిగిపోతుంది. ‘కేజీఎఫ్’ హీరో రాఖీ భాయ్ చనిపోతాడు. షిప్ మునిగిపోయే సమయంలో.. అందులో ఉన్న వాచ్ లో సమయంలో ఉదయం 5 గంటల 12 నిమిషాలు చూపిస్తుంది. ఇదే విషయాన్ని నెటిజన్లు హైలెట్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్2’లోని ఎండింగ్ సీన్ టైం, ప్రభాస్ ‘సలార్’ మూవీ టీజర్ రిలీజ్ టైం ఒకటే అంటూ మీమ్స్ చేస్తున్నారు.  

అంతేకాదు, ‘సలార్’ మూవీ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. కచ్చితంగా ‘కేజీఎఫ్’ సినిమాతో ‘సలార్’కు లింక్ ఉందని భావిస్తున్నారు. రాఖీ భాయ్, సలార్ మంచి ఫ్రెండ్స్ అని, రాఖీ భాయ్ కి ఇచ్చిన మాట ప్రకారమే అండర్ వరల్డ్ డాన్లను అంతం చేసేందుకు ‘సలార్’ రంగంలోకి దిగుతాడని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది తెలియదు కానీ, నెట్టింట్లో మాత్రం బాగా చర్చలు జరుగుతున్నాయి.  

సెప్టెంబ‌ర్ 28న 'సలార్' రిలీజ్

తెలుగు, త‌మిళం, హిందీతో పాటు వివిధ భార‌తీయ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 28న 'సలార్' రిలీజ్ కానుంది. సలార్ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తుండగా.. శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు పలు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు వంద రోజులే స‌మ‌యం ఉండ‌టంతో టీజ‌ర్ రిలీజ్ నుంచే ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Read Also: ఈ కొరియన్ థ్రిల్లర్స్ చూస్తే, ఊపిరి బిగపట్టుకుని సీటు అంచున కూర్చోవాల్సిందే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Jul 2023 02:59 PM (IST) Tags: Prabhas Prashanth Neel Salaar Teaser Salaar Teaser Release Salaar-Kgf Connection Salaar Teaser Memes

ఇవి కూడా చూడండి

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?