Kantara To Bhediya : మొన్న 'కాంతార' - ఇప్పుడు 'తోడేలు'
గీతా ఆర్ట్స్ సంస్థ జోరు చూపిస్తోంది. వరుస విజయాలు వస్తుండటంతో ఇప్పుడు మరింత ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరో సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతోంది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ జోరు చూపిస్తోంది. వరుస విజయాలు వస్తుండటంతో మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తోంది. రెండు నెలల వ్యవధిలో సంస్థకు రెండు విజయాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతోంది.
'కాంతార'ను తెలుగులో గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఆ సిన్మా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. త్వరలో హిందీ సినిమా 'భేడియా'ను తెలుగులో విడుదల చేయనుంది.
తెలుగులోకి 'తోడేలు'గా...
Varun Dhawan's Bhediya Telugu Release Update : వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా 'భేడియా'. హిందీ హిట్స్ 'స్త్రీ', 'బాలా' తర్వాత అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. హారర్ కామెడీ సినిమాలు 'స్త్రీ', 'రూహి' తర్వాత దినేష్ విజయన్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై హిందీలో మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను 'తోడేలు'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ!
ట్రెండింగ్‌లో 'భేడియా' సాంగ్స్!
ఇప్పటి వరకు 'భేడియా' నుంచి రెండు పాటలు విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 'తుమ్కేశ్వరి' పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు 'చిలిపి వరాలే ఇవ్వు' అనే మరో పాటను విడుదల చేశారు. ఈ రెండు పాటలు యూట్యూబ్, ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సచిన్ - జిగర్ సంగీతం అందిస్తున్నారు. 'చిలిపి వరాలే ఇవ్వు' పాటను కార్తీక్ ఆలపించారు. అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు.
Also Read : 'పోకిరి'లో మహేష్ - 'యశోద' డబ్బింగ్‌లో సమంత!
Bhediya Telugu Release Date : హిందీలో 'భేడియా' సినిమాను ఈ నెలాఖరున... 25వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో కూడా అదే రోజు విడుదల చేయనున్నట్టు గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది.
'స్త్రీ'... 'భేడియా'...
హారర్ - కామెడీ యూనివర్స్!
సినిమాటిక్ యూనివర్స్ అనే మాటలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. 'విక్రమ్'కు, కార్తీ 'ఖైదీ'కి లోకేష్ కానగరాజ్ లింక్ చేశారు. అదే విధంగా హిందీలో 'వార్', షారుఖ్ ఖాన్ 'పఠాన్'కు లింక్ ఉందని... ఆ రెండిటితో సిద్ధార్థ్ ఆనంద్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారని టాక్. 'భేడియా' కూడా అటువంటి సినిమాయే.
దినేష్ విజయన్ నిర్మించిన 'స్త్రీ', ఇప్పుడీ 'భేడియా'ను కలిపి త్వరలో మరో సినిమా చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ విడుదలైన 'తుమ్కేశ్వరి'లో పాటలో 'స్త్రీ'గా శ్రద్ధా కపూర్ సందడి చేశారు. వచ్చే ఏడాది వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, కృతి సనన్ తారలుగా 'స్త్రీ', 'భేడియా' సినిమాటిక్ యూనివర్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

