అన్వేషించండి

Samantha: ఏంటి ఈ జీవితం? ఎందుకు ఇలాంటి ఇబ్బందులు? ఆ రోజులను గుర్తుచేసుకుని సమంతా భావోద్వేగం

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతా ఎన్నో మానసిక ఇబ్బందులకు గురైంది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధిలో తీవ్ర అవస్థలు పడింది. తాజాగా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నెట్టింట్లో ఎమోషనల్ పోస్టు పెట్టింది.

తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంతా. టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. నాగ చైతన్యతో ప్రేమ వివాహం తర్వాత  మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడింది. చివరకు తన వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలికింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం పాలైంద. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. అప్పటికే వ్యక్తిగత సమస్యలతో మానసికంగా చాలా వీక్ గా మారిపోయిన సమంతను, ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి  శారీరకంగా చాలా కుంగదీసింది.  ఏడాది పాటు రకరకాల చికిత్సల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంది. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మామూలు మనిషిగా మారిపోయింది.

మయోసైటిస్ తర్వాత పరిస్థితులపై సమంతా ఎమోషనల్ పోస్టు  

తాజాగా తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తు చేసుకుంటూ సమంతా ఎమోషనల్ అయ్యింది. కష్టాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియలో ఓ పెద్ద పోస్టు షేర్ చేసింది. మయోసైటిస్ తర్వాత తన జీవితంలో వచ్చిన అనేక మార్పులను వివరించింది.

నా శరీరంతో నేనే ఎన్నో పోరాటాలు చేశా!

"నాకు మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. నా శరీరంతో నేనే ఎన్నో పోరాటాలు చేశాను. తిండి విషయంలో నోరు కట్టేసుకున్నాను. ఉప్పు, చక్కెర లేకుండా పథ్యంతో కూడిన ఆహారం తీసుకున్నాను. కొంతకాలం పాటు మందులే నాకు ఆహారం అయ్యాయి. ఇష్టం లేకపోయినా, ఎన్నో అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి ఈ జీవితం? ఎందుకు ఇలాంటి ఇబ్బందులు? అని ఆలోచించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడానికే ఈ ఏడాది సమయం పట్టింది. సినిమాల పరంగానూ నేను చాలా వైఫల్యాలను ఎదుర్కొన్నాను. ఈ ఏడాది కాలంలో నేను ఎన్నో పూజలు చేశాను. ఎందరో దేవుళ్లను మొక్కుకున్నాను. వారి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేశాను. మనసుకు ప్రశాంతతను, సమస్యలను ఎదుర్కొనే శక్తికి ఇవ్వమని దేవుళ్లను కోరుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

అన్నీ మనకు అనుకూలంగా జరగవు!

’’అన్నీ మనకు అనుకూలంగా జరగవని ఈ ఏడాది నాకు తెలిసి వచ్చింది. కష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో తెలిసి వచ్చింది. మన చేతుల్లో ఉన్నది మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. మన చేతిలో లేనిది మనం కంట్రోల్ చేయలేము. పోతే పోనీ అని వదిలేయాల్సిందే. సమస్యలను దాటడం కోసం ఒక్కో అడుగు ముందుకు వేయాల్సిందే. గతంలో జరిగిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ అక్కడే నిలిచి ఉండకూడదు. వాటిని దాటుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. నన్ను నన్నుగా ఇష్టపడే వారిని నేనూ ఇష్టపడుతాను. వారిని ప్రేమిస్తాను. నా శ్రేయోభిలాషుల మంచి కోసం ప్రయత్నిస్తా. అయితే, దేవుళ్లు మాత్రం మనం కోరుకున్నట్లుగానే మంచి చేస్తారు. ఒక్కోసారి మంచి చేయడం ఆలస్యం కావచ్చు. కానీ, తప్పకుండా మంచే చేస్తారు” అంటూ సమంతా ఓ సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో కలిస ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read Also: ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి తన భవిష్యత్ చెప్పి వణికించేసిన నర్మద! కేసు వెనక్కి తీసుకోవడమే మార్గం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి తన భవిష్యత్ చెప్పి వణికించేసిన నర్మద! కేసు వెనక్కి తీసుకోవడమే మార్గం!
Karthika Deepam 2 Serial Today October 17th: కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget