అన్వేషించండి

Rashmika Mandanna: జిమ్‌లో మిడ్ నైట్ రష్మిక వర్కవుట్స్... 100 కేజీలు ఎత్తిన నేషనల్ క్రష్

వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది రష్మిక మందన్న. తాజాగా ఈ ముద్దుగుమ్మ నైట్ షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు వెల్లడించింది. రాత్రి ఏదో, పగలు ఏదో తెలియట్లేదని చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna About ‘Kubera’ Night Shootings: కన్నడలో తన సినీ జర్నీని మొదలు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె... రీసెంట్ గా ‘యానిమల్’ చిత్రంతో సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సత్తా చాటుతోంది. వరుస సినిమాలో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప 2’తో పాటు ధనుష్, నాగార్జునతో కలిసి ‘కుబేర’ సినిమా చేస్తోంది. అటు ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది.

‘కుబేర‘ కోసం కష్టపడుతున్న రష్మిక

‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకున్న రష్మిక, ప్రస్తుతం ధనుష్ ‘కుబేర’ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక ప్రజెంట్ ముంబైలో ఉంది. అక్కడ బాగా కష్టపడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ఉండటంతో స్లీపింగ్ససైకిల్ (నిద్రించే వేళ్లల్లో మార్పులు వచ్చాయి) దెబ్బ తిన్నాయని చెప్పుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తన రోజువారీ పనులు ఎలా ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
Rashmika Mandanna: జిమ్‌లో మిడ్ నైట్ రష్మిక వర్కవుట్స్... 100 కేజీలు ఎత్తిన నేషనల్ క్రష్

“గత కొద్ది రోజులుగా నైట్ షూటింగ్స్ కు వెళ్తున్నాను. రోజు ఎలా ప్రారంభం అవుతుందో తెలియడం లేదు. నైట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చే సరికి ఉదయం 8 అవుతుంది. మీల్స్ చేసి, చదువుకుని పడుకునే సరికి మధ్యాహ్నం 12 అవుతుంది. మళ్లీ సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి మళ్లీ షూటింగ్ కు రెడీ అవుతున్నాను. బాడీనికి కాస్త ఫిట్ గా ఉంచుకునేందుకు కాస్త వర్కౌట్స్ చేస్తున్నాను. అదీ రాత్రి 1 గంటకు. తాజాగా 100 కేజీల బరువు ఎత్తాను. కాళ్లు, కీళ్లు బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. రన్నింగ్ చేస్తున్నాను. మళ్లీ రూమ్ కి వచ్చి డిన్నర్ చేసి షూటింగ్ కి వెళ్తున్నాను. ధనుష్ సర్, శేఖర్ సర్ తో పాటు ‘కుబేర’ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఫన్ గా ఉంది. ఇవాళ్టితో 30 రోజులు. ఎప్పటిలాగే ఉదయం 7 అవుతోంది. నా స్లీప్ సైకిల్ పూర్తిగా మారిపోయింది” అని రాసుకొచ్చింది.

ఇక ధనష్ కెరీర్ లో ‘కుబేర’ 51వ సినిమాగా రూపొందుతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించిన శేఖర్ కమ్ముల, ఇప్పుడు ఎలాంటి కథతో ఆడియెన్స్ ముందుకు వస్తారో? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: 'శబరి' నుంచి మరో సాంగ్ విడుదల- సరికొత్తగా ఆకట్టుకుంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్

టాప్ హెడ్ లైన్స్

Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Aditya Devulapally: 'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget