అన్వేషించండి

Meenakshi Chaudhary: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న 'గుంటూరు కారం' బ్యూటీ - ఈసారి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్!

Meenakshi Chaudhary New Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తాజా సమాచారం.

Meenakshi Chaudhary Next Movie: టాలీవుడ్ లో ఇప్పుడున్న అప్ కమింగ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీస్ లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ సరసన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో తెలుగు వెండితెరిపి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో తన గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఆ తర్వాత అడివి శేష్ తో కలిసి నటించిన 'హిట్ 2' మీనాక్షి కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో గ్లామర్ షో చేయడంతో పాటు లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. 'హిట్ 2'తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్

రీసెంట్ గా 'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మీనాక్షి చౌదరి సైతం వెంకటేష్ సినిమాలో నటిస్తుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో మీనాక్షి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందా? లేక సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ముచ్చటగా మూడోసారి

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'ఎఫ్2' సినిమా వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించాడు. కమర్షియల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'ఎఫ్ 3' కూడా మంచి సక్సెస్ సాధించింది. 'ఎఫ్ 3' తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు 'ఎఫ్2' ఫ్రాంచైజీక్ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వేరే కథతో రాబోతోంది. అనిల్ రావిపూడి - వెంకటేష్ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారు.

క్రేజీ టైటిల్

అనిల్ రావిపూడి ఈసారి విక్టరీ వెంకటేష్ కోసం విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. సొంత ఊళ్ల యొక్క ప్రాముఖ్యతను తెలిపేలా ఈ సినిమా కథాంశం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఫ్రెండ్షిప్, హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. ఈ సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట మేకర్స్. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడితో ఇప్పటివరకు పనిచేసిన హీరోలు కొందరు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'కల్కి2898AD' ట్రైలర్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget