అన్వేషించండి

Karthika Engagement: సైలెంట్​గా ‘రంగం’ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌, నెట్టింట్లో పిక్ వైరల్

‘రంగం’ హీరోయిన్ కార్తీక సైలెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు సౌత్ సినిమా పరిశ్రమలో హీరోయిన్​గా సత్తా చాటింది రాధ. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోయిలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. అభిమానుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  సీనియర్‌ నటి రాధ వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది నటి కార్తీక. ‘జోష్‌’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కనిపించింది. 2009లో వచ్చిన ఈ మూవీతో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. 2011లో విడుదలైన 'రంగం' సినిమా కార్తీక కెరీయర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో జూ. ఎన్టీఆర్‌ 'దమ్ము' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత అల్లరి నరేష్​తో కలిసి ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్‌ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. 2015 తర్వాత నుంచి కార్తీక వెండితెరకు పూర్తిగా దూరం అయ్యింది. 

‘రంగం’ బ్యూటీ నిశ్చితార్థం

సినిమాల్లో నటించకపోయినా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది కార్తీక. ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని, నవ్వుతూ కనిపించింది. చేతికి ఓ ఖరీదైన ఉంగరాన్ని ధరించి ఉంది. ఫోటో ఫోకస్ కూడా పూర్తిగా రింగ్ మీదే ఉంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు కార్తీక నిశ్చితార్థం చేసుకుందనే అభిప్రాయానికి వచ్చారు. సినీ అభిమానులతో పాటు నెటిజన్లు,  పలువురు ప్రముఖులు కార్తీకకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ ముద్దుగుమ్మ చేసుకోబోయే వరుడు ఎవరు? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karthika Nair (@karthika_nair9)

త్వరలో పెళ్లి వివరాలను ప్రకటించే అవకాశం

వాస్తవానికి గత కొద్ది రోజులుగా కార్తీక ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ కోడై కూసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. అయితే, కార్తీక ఎంగేజ్​మెంట్​కు సంబంధించి కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే నిశ్చితార్థంతో పాటు పెళ్లికి సంబంధించిన వివరాలను ఫ్యామిలీ మెంబ్సర్ చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

దుబాయ్​లో హోటల్స్ బిజినెస్ చూసుకుంటున్న కార్తీక

సినిమాలకు దూరం అయిన తర్వాత కార్తీక దుబాయ్ లో ఉంటుంది. అక్కడ తన ఫ్యామిలీకి సంబంధించిన హోటల్స్ బిజినెస్ ను తనే హ్యాండిల్ చేస్తోంది. దుబాయ్ లో తమ హోటల్స్ బిజినెస్ ను భారీగా విస్తరించి పలు అవార్డులు కూడా అందుకుంది కార్తీక. మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న కార్తీకను కట్టుకోబోయే వరుడు ఎవరు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.  

Read Also: కంగనాను కావాలనే పిలవలేదు, కరణ్ జోహార్​ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Gundeninda Gudigantalu Oct 13: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
గుండెనిండా గుడిగంటలు: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 13: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ
Podarillu Serial Today Oct 13: ఇంటిని దోచుకోవడానికే వచ్చిన జమున..అందరూ ఎవరి పనులపై వాళ్లు వెళ్లినప్పుడు డబ్బుకోసం వెతుకులాట
పొదరిల్లు: ఇంటిని దోచుకోవడానికే వచ్చిన జమున..అందరూ ఎవరి పనులపై వాళ్లు వెళ్లినప్పుడు డబ్బుకోసం వెతుకులాట

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget