అన్వేషించండి
Advertisement
Puspha Viral Video: సుక్కు, బన్నీ చేసిన పని, వీడియో షేర్ చేసిన జగ్గూభాయ్
సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్ లో ఓ షోకి హాజరయ్యారు. అందులో పాండా బొమ్మ 'పుష్ప'లో పాటకి స్టెప్స్ వేస్తూ కనిపించింది.
ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడం వేరు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం వేరని చెప్పాలి. ఈ మధ్యకాలంలో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించిన సినిమా ఏదైనా ఉందంటే 'పుష్ప' అనే చెప్పాలి. ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందంట.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ.. బన్నీ మేనరిజమ్స్ ను ఫాలో అయిపోతున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా 'పుష్ప'కి భారీ క్రేజ్ వస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో 'తగ్గేదేలే', 'శ్రీవల్లి' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 'శ్రీవల్లి' పాటలో బన్నీ వేసిన స్టెప్ ఓ రేంజ్ లో జనాల్లోకి వెళ్లింది. చెప్పు జారిపోతే తిరిగి తొడుక్కుంటూ బన్నీ వేసే స్టెప్ ను అందరూ అనుకరిస్తున్నరు. ఇప్పటివరకు సెలబ్రిటీలు, క్రికెటర్స్, ఫ్యాన్స్.. ఈ స్టెప్ ను అనుకరిస్తే.. ఇప్పుడు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా 'శ్రీవల్లి' స్టెప్పును వేస్తూ 'తగ్గేదేలే' అనే డైలాగ్ చెప్పడం హైలైట్ అవుతోంది.
సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్ లో ఓ షోకి హాజరయ్యారు. అందులో పాండా బొమ్మ 'పుష్ప'లో పాటకి స్టెప్స్ వేయగా అక్కడే ఉన్న జగపతిబాబు.. 'బన్నీ, సుక్కు చేసిన పని.. పాండా కూడా డాన్స్ చేస్తోంది.. దాంతో కలిసి నేను కూడా స్టెప్ వేశాను.. ఈ సినిమా ఇంతగా జనంలోకి తీసుకెళ్లిన 'పుష్ప' టీమ్ కి హాట్సాఫ్' అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం 'పుష్ప' 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion