అన్వేషించండి

ఆసుపత్రిలో అబ్బాస్, అసలు ఏమైంది?

తాజాగా అబ్బాస్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హీరో అబ్బాస్ గురించి తెలియని వారుండరు. తెలుగులో 'ప్రేమదేశం' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారాయన. అయితే ఆ సినిమా తర్వాత కొన్ని తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు అబ్బాస్. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఫ్యామిలితో కలసి ఉంటున్నారు. అయితే తాజాగా అబ్బాస్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగులో 1996లో వచ్చిన 'ప్రేమ దేశం' సినిమాతో అబ్బాస్ భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా యూత్ ను అంతలా ఆకట్టుకుంది. దీంతో మంచి క్రేజ్ వచ్చేసింది. అప్పట్లో అబ్బాస్ కు లేడి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. చాలామంది అమ్మాయిలకు అతనే డ్రీమ్ హీరో. అబ్బాస్ కటింగ్ కూడా ఆ టైమ్ లో  యూత్ ను ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించారు అబ్బాస్. తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్ లో ఫ్యామిలీతో ఉంటున్నారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‎ గా సెటిల్ అయ్యాడు. అయితే చాలా సంవత్సరాలుగా అటు సినీ ఇండస్ట్రీకి, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అబ్బాస్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. తాజాగా అబ్బాస్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో ను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి సెలైన్, ఆక్సిజన్ ట్యూబ్స్ తో ఐసీయూలో ఉన్నట్లు కనిపించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

అయితే ఇటీవల ఆయనకు శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం అబ్బాస్ కు బైక్ యాక్సిడెంట్ జరిగిందట. దాంతో ఆయన మోకాలికి గాయమైందట. ఆ గాయం బాగా ఇబ్బంది కలుగజేస్తుండటంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారట. వైద్యుల సలహా మేరకు ఆయన మోకాలికి సర్జరీ చేయించుకున్నారని సమాచారం. అబ్బాస్ ఆ ఫోటో ను షేర్ చేస్తూ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తన మనసంతా గందరగోళంగా ఉందని తెలిపాడు. దాన్ని అధిగమించేందుకు తాను ఎంతగానో ప్రయత్నించానని, అయితే సర్జరీ తర్వాత కొంత ఉపశమనం కలిగినట్లు పేర్కొన్నాడు. తన కోసం ప్రార్థించినవారికి ధన్యవాదాలు అని తెలిపాడు.

అబ్బాస్ తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు.  తెలుగులో కూడా ఆయనకు అభిమానులు బాగానే ఉన్నాడు. 'ప్రేమదేశం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మలయాళంలోనూ హీరోగా నటించాడు. తెలుగులో ప్రేమదేశంతో పాటు రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడు గారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో లాంటి సినిమాల్లో నటించాడు అబ్బాస్. అయితే 2015 తర్వాత సినిమాల నుంచి దూరం అయిన ఆయన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాడు.

Also Read: ఇక ఆపండి చాలు - క్యాన్సర్ వార్తలపై మమతా మోహన్ దాస్ ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget