News
News
X

Aadi's Top Gear Trailer : 'టాప్ గేర్'లో ఆది సాయికుమార్ యాక్షన్ థ్రిల్లర్ - ట్రైలర్ రెడీ

Aadi Sai Kumar's TOP Gear Movie : ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సినిమా 'టాప్ గేర్'.  త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. 

FOLLOW US: 
Share:

ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన చిత్రం 'టాప్ గేర్'. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరున... డిసెంబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంత కంటే ముందు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

డిసెంబర్ 18న 'టాప్ గేర్' ట్రైలర్Top Gear Movie Trailer : డిసెంబర్ 18న 'టాప్ గేర్' ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్పీడుగా జరుగుతున్నాయని తెలిపారు. భారీ నిర్మాణ వ్యయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాను తెరకెక్కించమని చెప్పారు.

Also Read : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం

పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్'లో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారని దర్శక నిర్మాతలు ముందే వెల్లడించారు. టీజర్‌లో ఆయన టాక్సీ డ్రైవ్ చేస్తున్నట్లు చూపించారు. కార్ అద్దంలో ఒక్కొక్క క్యారెక్టర్ చూపించారు. ఆ తర్వాత హీరోకి అన్‌నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. 

'విధి రాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడు అన్నది ఎంత నిజమో... నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అన్నది కూడా అంతే నిజం' అని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత కారులో వెనుక కూర్చున్న వ్యక్తి హీరోలో గన్ గురి పెడతారు. దాంతో టాప్ గేరు వేసి, స్పీడుగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అతడిని పోలీసులు ఎందుకు వెంబడించారు? వెనుక బైకులో ఫాలో అయిన వ్యక్తి ఎవరు? 'ఇప్పుడు రెండు ప్రాణాలు పోతాయ్!' అని మళ్ళీ వార్నింగ్ ఎందుకు వచ్చింది? అనేది సస్పెన్సులో ఉంచారు. 

'టాప్ గేర్' టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందని, మంచి థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. ''అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు .

వెన్నెల... వెన్నెల... పెళ్లి తర్వాత పాట!
'టాప్ గేర్' చిత్రంలో ఆది సాయి కుమార్‌కు జంటగా రియా సుమన్ (Riya Suman) నటించారు. కథలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ సమయంలో వచ్చే 'వెన్నెల వెన్నెల...' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మధ్య ఆ పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర  బృందం సంతోషం వ్యక్తం చేసింది.

ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆయన బాణీకి సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ సూపర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సైతం బావుందని చెబుతున్నారు.  

బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.

Published at : 14 Dec 2022 03:53 PM (IST) Tags: Riya Suman Top Gear Telugu Movie Aadi Sai Lumar Top Gear Release Date Top Gear Trailer

సంబంధిత కథనాలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!