News
News
X

Aadhi Pinisetty - Nikki Galrani: ప్రెగ్నెంట్ వార్తలపై ఎమోజీలతో స్పందించిన ఆది పిన్నిశెట్టి భార్య నిక్కీ గల్రానీ

తాను తల్లికాబోతున్నట్టు వస్తున్న వార్తలపై హీరోయిన్, ఆది పిన్నిశెట్టి భార్య నిక్కీ గల్రానీ స్పందించారు.

FOLLOW US: 

కొన్నాళ్ళ పాటు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఒక్కటైన జంట ఆది పిన్నిశెట్టి, నిక్కీ గల్రానీ. జంట ఈ ఏడాది మేలో కన్నుల పండుగగా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వాటిపై నిక్కీ గల్రానీ తనదైన శైలిలో స్పందించారు. తన ప్రెగ్నెన్సీ వార్తల గురించి మాట్లాడుతూ డెలివరీ డేట్ కూడా చెప్పేయ్యాలని అడిగారు.

“నేను ఈ వార్త విని షాక్ అయ్యాను. కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ చేస్తున్నారు. డెలివరీ డేట్ కూడా చెప్పేయండి మరి” అని నవ్వుతున్న ఏమోజీలు పెట్టారు. “భవిష్యత్ లో ఏదో ఒక రోజు నేను దీన్ని బ్రేక్ చేస్తాను. అప్పటి వరకి రూమర్లు నమ్మకండి” అని నిక్కీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. మలుపు సినిమాతో తొలిసారి ఆది-నిక్కీ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లోనే వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇద్దరు స్పందించలేదు. కొన్నాళ్ళ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించిన ఈ జంట మే 18, 2022న కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.

Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?

హీరోగాను, విలన్ గాను చేసి తనదైన నటనతో మెప్పించారు ఆది పిన్నిశెట్టి. ఆది పినిశెట్టి ఫ్యామిలీ తమిళనాడులో సెటిల్ అయినా వీరు తెలుగువాళ్లే అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే ఆదికు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన చాలా టాలీవుడ్ సినిమాల్లో నటించాడు కూడా. ‘ఒక వి చిత్రం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు తెలుగులో గ్యాప్ ఇచ్చారు ఆది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు. ‘వైశాలి’ సినిమా ఆదికు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇక్కడ కూడా కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత 'ఏకవీర', 'గుండెల్లో గోదారి' వంటి సినిమాలు ఆయనలో విలక్షణ నటుడ్ని పరిచయం చేశాయి. 'మలుపు', 'మరకతమణి' లాంటి సినిమాలు తెలుగులోనూ ఆకట్టుకున్నాయి. తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేసిన 'సరైనోడు' సినిమాలో విలన్ గా చేసి మంచి మార్కులు కొట్టేశాడు ఆది. ఇక 'రంగస్థలం' సినిమాలో కుమార్ బాబుగా ఆది చేసిన నటనతో ఆయనకు వంద శాతం మార్కులు పడ్డాయి. తర్వాత ‘నీవెవరో’ ‘అజ్ఞాతవాసి’ ‘యూటర్న్’ ‘ది వారియర్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు ఆది.

News Reels

Published at : 19 Nov 2022 08:49 AM (IST) Tags: Aadhi Pinisetty Nikki Galrani Aadhi-Nikki Nikki Galrani Pregnancy News

సంబంధిత కథనాలు

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

టాప్ స్టోరీస్

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!