అన్వేషించండి

A R Rahman: ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలకు రెహ్మాన్ ఓకే చెప్తారా..?

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో తమన్ జోరు మరింత పెరిగింది. వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ అయితే 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. వీరిద్దరూ కూడా ఒక్కో సినిమాకి రూ.3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. పైగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలు వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నారు. 

ఈ క్రమంలో మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలానే ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ ను పలు సినిమాల కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

అలానే దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా తన సినిమాకి ఏఆర్ రెహ్మాన్ తో మ్యూజిక్ వర్క్ చేయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను రూపొందిస్తున్న ఆయన తన తదుపరి సినిమాను కూడా రౌడీ హీరోతోనే చేయబోతున్నారు. మహేష్ కోసం రాసుకున్న 'జనగణమన' స్క్రిప్ట్ తో విజయ్ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి కరణ్ జోహార్ బ్యాకప్ ఉండడంతో రెహ్మాన్ కచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. 

నిజానికి రెహ్మాన్ తెలుగు సినిమాలకు పెద్దగా పని చేసింది లేదు. మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ ను అనౌన్స్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు రెండు క్రేజీ సినిమాల కోసం ఆయన్ను సంప్రదించనున్నారు. మరి ఈ సినిమాలైనా ఒప్పుకుంటారో లేదో..!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARR (@arrahman)

టాప్ హెడ్ లైన్స్

Hrithik Roshan : గర్ల్ ఫ్రెండ్‌తో హృతిక్ రోషన్... 5వ లవ్ యానివర్సరీ - మాజీ భార్య క్యూట్ రియాక్షన్
గర్ల్ ఫ్రెండ్‌తో హృతిక్ రోషన్... 5వ లవ్ యానివర్సరీ - మాజీ భార్య క్యూట్ రియాక్షన్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: షాలినిని ఆటలో తీసేసిన దేబ్జానీ! బాత్‌రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న షాలిని! రోహిత్‌ని పట్టుకొని ఏడుపు!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: షాలినిని ఆటలో తీసేసిన దేబ్జానీ! బాత్‌రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న షాలిని! రోహిత్‌ని పట్టుకొని ఏడుపు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: డబ్బు కోసం పద్మాక్షి, సహస్ర కాలు పట్టుకున్న మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: డబ్బు కోసం పద్మాక్షి, సహస్ర కాలు పట్టుకున్న మహా!
Allu Arjun : హైదరాబాద్‌లో అల్లు అర్జున్ న్యూ ఆఫీస్ - అత్యాధునిక హంగులతో ఐకాన్ స్టార్ ICONZA
హైదరాబాద్‌లో అల్లు అర్జున్ న్యూ ఆఫీస్ - అత్యాధునిక హంగులతో ఐకాన్ స్టార్ ICONZA

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Embed widget