అన్వేషించండి
Rama Rao On Duty: 'రామారావు ఆన్ డ్యూటీ' లీక్డ్ వీడియో - షేక్ చేస్తున్న పొలిటికల్ డైలాగ్స్!
రేపు థియేటర్లలో విడుదల కానున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి ఓ సన్నివేశం లీకైంది.

'రామారావు ఆన్ డ్యూటీ' లీక్డ్ వీడియో
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (RamaRao On Duty Movie). జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శరత్ మండవ (Sarath Mandava) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా కనిపించనున్నారు.
రేపు థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఓ సన్నివేశం లీకైంది. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ''రేయ్ మీరు ఎవరో.. ఏ పార్టీయో నాకు అనవసరం... ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం... చెరువులు పూడ్చేస్తాం... అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే... అవుట్ అవుట్'' అంటూ హీరో డైలాగ్ చెప్పే సీన్ లీకైంది.
ఇప్పుడు వీడియోలో వినిపించిన డైలాగ్స్ వివాదాస్పదంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ డైలాగ్స్ ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ అధికారులు ఈ వీడియో చూస్తే గనుక రిలీజ్ కి అడ్డుపడే అవకాశం ఉందని తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ లీక్డ్ వీడియో సినిమాకి మరింత హైప్ ని తీసుకొచ్చిందని చెప్పాలి.
Leaked Video-#RamaRaoOnDuty 🔥✊🏻
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) July 28, 2022
వైసీపీ మీకోసమే రాసారు డైలాగ్ Book Your Tickets Tomorrow👍 pic.twitter.com/2JHKsArhcz
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion