Sajjala Ramakrishna Reddy: 'ఆ ఘటనల్లో ఒక్క వీడియోనే లీకైందా?' - ఎన్నికల ంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నలు
Andhra Pradesh News: మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి వైసీపీ నేత సజ్జల స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు.
Sajjala Questions To Election Commission: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా, దీనిపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy).. ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారని చెబుతోన్న వీడియో నిజమైనదని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా.? అని ప్రశ్నించారు. వీడియో నిజమైనదో.? కాదో.? ఎలాంటి నిర్ధారణ చేయకుండానే ఈసీ ఎలా చర్యలకు దిగుతుంది.? అని అన్నారు. ఒకవేళ ఆ వీడియో నిజమైనదే అయితే సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది.? అనే సందేహం వెలిబుచ్చారు.
'ఆ వీడియోనే లీకైందా.?'
'మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఈవీఎంలకు సంబంధించి 7 ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!. అలాంటప్పుడు కేవలం ఒక్క వీడియోని మాత్రమే ఎలా లీక్ చేస్తుంది. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలు, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించి ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు.?. అన్నీ వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది. కానీ ఓ చిన్న క్లిప్పింగ్ మాత్రమనే బయటకు ఎలా వస్తుంది.? తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీకి చెందిన వారు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిపై ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు.? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు.?' అని సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు.
A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue -
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.
1. If the Palvai gate video is from the official webcasting source(which is the EC’s exclusive property), how did it get leaked and why did the EC move so hastily without checking the authenticity of the video?
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
2. While it’s an acknowledged fact by the commission that a total of 7 instances of EVM damages occurred in Macherla constituency, what is holding the EC back from releasing all of them, in full length, so that the culprits are exposed and appropriate action is taken?
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024