Telangana Elections 2023 : వైన్ షాపుల్లో సరుకంతా ఖాళీ - ముందుగానే మందుబాబుల జాగ్రత్త !
Telangana Elections 2023 : వైన్ షాపులను కూడా క్లోజ్ చేశారు. కానీ అంతకు ముందు మందుబాబులు మొత్తం స్టాక్ కొనేశారు. పోలింగ్ ముగిసిన తర్వాతనే మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
Telangana Elections 2023 : ఎన్నికల దెబ్బకు రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ ఖాళీ అయ్యాయి. 30న పోలింగ్ కారణంగా 28వతేదీన మంగళవారం ప్రచారం ముగిసే గడువు అయినందున సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకూ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మందుబాబులు రిజర్వ్ సరుకు కొనేందుకు పోటీపడ్డారు. దొరికిన మద్యాన్ని దొరికినట్లుగా కొనేసుకున్నారు. క్వార్టర్ బాటిళ్లు, చీప్ లిక్కర్ 90 బాటిళ్లు కూడా స్టాక్ మొత్తం అయిపోయేంతగా అమ్మేశాయి. దీనికి తోడు రాజయ నాయకులు సైతం పెద్ద మొత్తంలో కార్యకర్తలకు మద్యం సరఫరా చేయడానికి కొనుగోలు చేయడంతో దాదాపు అన్ని దుకాణాలు సోమవారం రాత్రికే ఖాళీగా కనిపించాయి. ఆదివారం ఒక్క రోజే పది లక్షల రూపాయలకుపైగా అమ్మకాలు జరిగాయని దుకాణదారులు చెబుతున్నారు. సోమవారం అది కూడా దాటిపోయి ఉంటుందని అంటున్నారు.
నేటి సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. వైన్స్, బార్లు మూసివేయాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌కు రెండ్రోజల మందు నుంచే మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘించి మద్యం దుకాణాలు తెరిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రచార గడువు ముగిసిన వెంటనే మద్యం దుకాణాలకు కూడా సీల్ వేయనున్నారు. సాయంత్రమే అబ్కారీ అధికారులు మద్యం దుకాణాల దగ్గర పరిశీలించారు. ఇప్పటి వరకు ఉన్న స్టాక్ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎన్నికల కారణంగా దుకాణాల్లో అక్రమంగా మద్యం తరలిస్తారనే సమాచారంతో దుకాణాల్లో నిల్వలను రికార్డు చేసుకుని తాళం వేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించనున్నారు.
సాధారణంగా మద్యం డిమాండ్ ఎన్నికల సమయంలో ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ప ార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ప్రతీ రోజూ మద్యం ఇవ్వడాన్ని మెనూలో పెట్టుకంటాయి. అందుకే విపరీతంగా అమ్మకాలు జరుపుతాయి. సాధారణంగా మద్యం అలవాటు ఉన్న మందుబాబు... ప్రతీ రోజూ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసుకుంటారు. ఫుల్ బాటిళ్లు కొనుగోలు చేసే వాళ్లు తక్కువ. ఇలా రెండు, మూడు రోజులు సెలవులు వస్తే ఫుల్ బాటిల్స్ కొనుగోలు చేస్తూంటారు.