Janasena Contesting Seats: జనసేన 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ- మొదటి జాబితాలో అభ్యర్థులు ఎవరంటే?
Janasena Contesting Seats: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ వస్తోంది. దీనిపై మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.
Janasena Contesting Seats: తెలుగుదేశంతో పొత్తుల్లో భాగంగా జనసేనకు కీలకమైన స్థానాలు లభించాయి. ఇందులో చాలా చోట్ల టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పొత్తు ధర్మలో భాగంగా సీట్లు కేటాయించింది. మొదటి జాబితాలో జనసేనకు లభించిన స్థానాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది.
) నెల్లిమర్ల- మాధవి
2) అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
3) కాకినాడ రూరల్- పంతం నానాజీ
4) తెనాలి- నాదేండ్ల మనోహర్
5) రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తగ్గాం
24 స్థానాలకే పరిమితం అవ్వడంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి దక్కించుకోవచ్చని కానీ దాని వల్ల ప్రత్యర్థికి ప్రయోజనాలు ఉంటాయనే తగ్గినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తీసుకున్న 24 స్థానాలను 24 విజయం సాధించగలగితే భవిష్యత్ బాగుటుందని అభిప్రాయపడ్డారు.
పొత్తులో భాగంగా తీసుకున్న 24 స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్న లీడర్‌లను నియమిస్తామన్నారు పవన్ కల్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేయడం కంటే... రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. చాలా మంది 70 స్థానాల్లో పోటీ చేయాలని డిమాండ్‌లు వస్తున్నాయని వాస్తవ దృక్పథంలో ఆలోచించాలని పవన్ సూచించారు.
2019 ఎన్నికల ఫలితాలు కూడా చూసుకొని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్. గత ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో విజయం సాధించి ఉంటే ఇప్పుడు మరిన్ని సీట్లు అడిగే అవకాశం ఉండేదన్నారు. అన్నింటినీ ఆలోచించి జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితం కావాలని నిర్ణయించినట్టు పవన్ తెలిపారు.
కచ్చితంగా బీజేపీ ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. ఆ పార్టీ కోసం కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చిందన్నారు. పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు పవన్. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.