Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Telangana CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మిటింగ్ ముగిసింది.
తెలంగాణ సీఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది సీఎల్పీ. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశానికి 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో అధినాయకత్వం తరఫున డీకేశివకుమార్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అందరూ చర్చించి సీఎం ఎంపిక బాధ్యతను అధినాయకత్వానికి ఇచ్చింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లోకి వచ్చినప్పటి నుంచి సీఎం అభ్యర్థిగా ఎవరు ఎంపిక అవుతారనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. తెలంగాణలో నోటిఫికేషన్ రాక ముందు నుంచే చాలా మంది సీనియర్లు తాము సీఎం అభ్యర్థి అంతే తాము సీఎం అభ్యర్థి అంటూ ప్రకటనలు చేశారు. అయితే ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తర్వాత అందరి సమ్మతితో సీఎంగాఎవరు ఉండాలనే విషయం చర్చిద్దామని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పింది. దీంతో సీనియర్లంతా సైలెంట్ అయిపోయారు.
విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కాంగ్రెస్ సీనియర్లు అంతా కష్టపడ్డారు. వారి వారి నియోజకవర్గాలతోపాటు పక్క నియోజకవర్గాల విజయం కోసం శ్రమించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానై అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. మిగతా వాళ్లు మాత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకే పరిమితమై ప్రచారం చేశారు.
అందరూ ఐక్యంగాఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం చాలా మంది పోటీకి వస్తారనే సందేహం చాలా మందిలో కనిపించింది. అయితే సీఎల్పీ భేటీకి ముందు చాలా మంది సీనియర్లతో డీకే శివకుమార్‌తోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు.