Telangana Election Results 2024: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జోరు - సింగిల్ డిజిట్‌తో కారుకు బ్రేకులు!
Telangana Lok Sabha Election Results 2024: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో కేవలం ఒక స్థానంలోనే లీడ్ లో కొనసాగుతోంది. ఎంఐఎం మరో చోట ఆధిక్యంలో ఉంది.
Telangana Lok Sabha Election Results 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సత్తా చాటుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ప్రభావం చూపిస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలోనే లీడ్ లో ఉంది. ఎంఐఎం ఒక చోట ఆధిక్యంలో ఉంది. మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతుండగా.. హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.
మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
ఆధిక్యంలో ఉన్న స్థానాలు ఇవే
తెలంగాణ పార్లమెంట్ స్థానాలు
ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం
నిజామాబాదు లో బీజేపీ ఆధిక్యం
చేవెళ్ల లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కి 3,325 ఓట్ల ఆధిక్యం
మల్కాజిగిరి లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
మహబూబ్ నగర్ లో బీజేపీ ఆధిక్యం
కరీంనగర్ లో బీజేపీ ఆధిక్యం
హైదరాబాద్ లో MIM ఆధిక్యం
నల్గొండ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
పెద్దపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
ఖమ్మం లో కాంగ్రెస్ ఆధిక్యం