Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!
Telangana Polling News: లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలోని GPRA క్వార్టర్స్ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది.

తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం దాటినప్పటికీ ఇంకా ఆశించినంతగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చింది. కానీ, కొంత మంది ఓటు వేయకుండా ఈ సెలవు రోజును ఇతర పనులకు వాడుకుంటున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా, వాళ్ల బాధ్యతను గుర్తు చేసేలా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తీరు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది.
లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలోని GPRA క్వార్టర్స్ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది. శేషయ్య అనే 75 ఏళ్ల వయసున్న వ్యక్తి గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్నారు. ఓటు వేయడం బాధ్యతగా భావించి.. ఓ పౌరుడిగా తన కర్తవ్యం అని ఆయన చాటుతున్నారు. ఏకంగా ఆక్సీజన్ సిలిండర్, మాస్క్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని చెప్పారు. దీంతో ఆయన ఎంత మందికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

