అన్వేషించండి

Telangana election 2023: నామినేషన్లపై అభ్యంతరాలు ఉన్నాయా-ఎవరైనా సరే ఇలా ఫిర్యాదు చేయండి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్లలో అభ్యంతరాలు ఉంటే... సామాన్యులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అది ఏలాగో తెలుసుకోండి.

ఎన్నికలు ఏవైనా పరే... మొదట జరిగే ప్రక్రియ నామినేషన్లు వేయడం. ఇది అత్యంత కీలకమైనది. నామినేషన్లు ఓకే అయిన అభ్యర్థులే ఎన్నికల బరిలో ఉంటారు. ఈ  నామినేషన్లలో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. విద్య, వ్యాపారం, ఆస్తులు, వారసత్వ సంపద, నేరచరిత్ర, కేసులు... ఇలా అన్ని వివరాలు అఫిడవిట్‌లో  పొందుపరచాలి. దీన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు అయితే..  కొంత మంది అభ్యర్థులు అన్ని వివరాలను పొందుపరచు. అంతేకాదు.. ఇంకొందరు తప్పుడు  వివరాలను కూడా నామినేషన్‌ పత్రాల్లో పొందుపరచవచ్చు. అలాంటి వారు ఉంటే... సామాన్యులు అయినా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు.  కానీ ఇలాంటి అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో సామాన్యులు కూడా భాగం కావొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఫిర్యాదులు ఉన్నా... వారి నామినేషన్‌ పత్రాల్లో  అవకతవకలు ఉన్నా... వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.

ఒక అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన తర్వాత... ఆ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆ తర్వాత... రిటర్నింగ్‌ ఆఫీసు  ముందు బోర్డుపై అఫిడవిట్‌ను ఉంచుతారు. ఆ ఆఫిడవిట్‌ను ఎవరైనా పరిశీలించవచ్చు. ఒకవేళ అందులో వివరాలు తప్పుగా ఉన్నా... లేక కీలకమైన అంశాలు  పొందుపరచకపోయినా.. వెంటనే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పలానా అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేవనో.. లేక ఇచ్చిన  సమాచారం తప్పనో... లిఖితపూర్వకంగా రిటర్నింగ్‌ అధికారికి లేఖ రాస్తే సరిపోతుంది. దీనికి ప్రకారం సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో  సామన్యులకు ఇచ్చిన హక్కు అది. దీన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు.

నామినేషన్లలో అవకతవకలు ఉన్నాయంటూ... ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరికి కోర్టు డిక్వాలిఫై కూడా చేసింది. అంటే...  నామినేషన్‌ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ప్రజల ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా... నామినేషన్లు సరిగా ఇవ్వలేదన్న కారణంగా..  ఎమ్మెల్యే పదవులు వదలుకోవాల్సి వస్తుంది. 

2018 ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా కృష్ణమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది ఏపీ హైకోర్టు. ఆయన చేతిలో ఓడిపోయిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇస్తే.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో పూర్తి వివరాలు... సరైన వివరాలు ఇవ్వడం చాల ముఖ్యం. ఏ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో అయినా తప్పులు, అవకతవకలు ఉంటే.. సామాన్యులు కూడా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు.

ఇక... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలిరేజే 100 నామినేషన్లు దాఖలయ్యాయి.  కాంగ్రెస్‌ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున కొడంగల్‌లో ఆయన సోదరుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా.. హైదరాబాద్ గోశామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారావు అబిడ్స్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget