అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా- సింగరేణి కార్మికులకు పీసీసీ చీఫ్ రేవంత్ హామీ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్ సమావేశమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి(Singareni) సమస్యలన్నీ పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్(Telangana PCC Chief) రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. భూపాలపల్లి(Bhupalapalli)లో సింగరేణి(Singareni) కార్మికులతో రేవంత్ సమావేశమయ్యారు. భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ(Gandra Satyanarayan) ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారన్న ఆయన, సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3(December 3)న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు. గనుల బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిందన్న ఆయన, సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాల్సిందేనన్నారు. సింగరేణికి సీఎండీగా ఒకే అధికారిని ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల త్యాగాలను సీఎం(TElangana CM) కేసీఆర్(KCR) మరిచిపోయారని విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర(Bus Tour) దిగ్విజయంగా కొనసాగుతోంది. ములుగు(Mulugu)లో జరిగిన కాంగ్రెస్ విజయభేరిసభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక (Priyanka) విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ మాఫియాలన్నీ కలిసిపోయి ప్రజాధనాన్ని లూటీచేస్తున్నాయని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటూనే రూ.వేల కోట్లు లూటీ చేసి భవంతులు నిర్మించుకున్నారని, 18 మంత్రిత్వశాఖలు కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయన్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణకు గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉక్కు కర్మాగారం ఇస్తామని కేంద్రం చెప్పినా ఒక్క అంగుళం ముందుకు కదల్లేదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన బీహెచ్‌ఈఎల్(BHEL), హెచ్‌ఏఎల్(HAL), రైల్వేలను మాత్రం మోడీ తన మిత్రులకు అమ్ముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ధాన్యానికి రూ.2500, సోయాకు రూ.2200, చెరకుకు రూ.4000, పత్తికి రూ.6500 ఇస్తామన్నారు. రూ.2 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని, అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.