అన్వేషించండి

రాష్ట్రమంతా చుట్టేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రచారంలో సీనియర్లంతా గప్ చుప్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఒకరంటే మరొకరికి పోసగదు. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నేతల్లో ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది.

Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది.  క్యాంపెయిన్ (Compaign) కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో...అధికార బీఆర్ఎస్ (Brs), కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp) నేతలు నియోజకవర్గాలను కాళ్లకు బలపం కట్టుకొని చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు...విరామం లేకుండా నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున గ్రామాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. 

విభేధాలను పక్కన పెట్టేసి....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఒకరంటే మరొకరికి పోసగదు. నిత్యం ఒకరిపై కత్తులు నూరుకోవడమే తెలుసు. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు...నేతల్లో ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒంటి కాలి మీద లేచే నేతలు సైలెంట్ అయిపోయారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీ హనుమంతరావు లాంటి నేతలు రేవత్ రెడ్డిని పల్లెత్తి మాట కూడా అనడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలను మార్చేశాయి. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో నేతలు కూడా పాత విభేదాలను పక్కన పెట్టేశారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. తామంటే తాము సీఎం అభ్యర్థులమంటూ చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలంతా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో తాము గెలిస్తే చాలన్నట్లు సీనియర్లంతా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, హుజుర్ నగర్ లోఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.

సీనియర్లు నియోజకవర్గాలకే పరిమితం
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అని చెప్పుకునే నేతలంతా...ప్రచారంలో తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఎవరు కూడా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు వంటి నేతలు కొత్తపలుకు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని...నేతలంతా కలిసి కట్టుగానే ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై ప్రశ్నలు వస్తున్నా...ఎవరు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రేసులో ఉన్నామంటున్నారే తప్పా, తామే అవుతామని చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డిని విమర్శించిన నేతలంతా తమ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. దీనికి కారణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందర్ని కట్టడి చేసేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి, నేతల వ్యవహారశైలిపై ఎప్పటికపుడు రిపోర్టులు ఇచ్చేశారు.  పార్టీలో కోవర్టు ఎవరు ? పార్టీకి జరుగుతున్ననష్టంపై పూర్తిగా హైకమాండ్ కు రిపోర్ట్ అందడంతో సీనియర్లంతా దెబ్బకు దారిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిని సోనియా గాంధీని నిర్ణయిస్తారని చెబుతున్నారు. మొన్నటి దాకా గోతులు తవ్వుకున్న నేతలంతా కలిసిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్Ind vs Aus Match Highlights | Champions Trophy 2025 ఫైనల్ కు చేరుకున్న టీమిండియా | ABP DesamPM Modi inaugurates Vantara | అంబానీల జంతు పరిరక్షణ కేంద్రం 'వంతారా' ను ప్రారంభించిన ప్రధాని మోదీInd vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
Tamannaah Vijay Varma Breakup: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
Embed widget