Chandrababu: 'మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఫస్ట్ సంతకాలు' - ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలన్న చంద్రబాబు
Andhra Pradesh News: ఐదేళ్ల సైకో పాలనకు అంతం పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాల, తిరుపతి ప్రజాగళం సభల్లో ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
Chandrababu Slams Cm Jagan In Nandyal Prajagalam Meeting: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన శనివారం నంద్యాల (Nandyal), తిరుపతిలో (Tirupati) నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని.. సైకో పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 'రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టబడులు తీసుకొస్తాం. ఏడాదికి 5 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రూ.200 పింఛన్ ను రూ.2 వేలు చేశాం. ఈ పింఛన్ ను రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే అందిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూములు కాజేయాలని చూస్తున్నారు. మన భూమి పాస్ బుక్ పై జగన్ ఫోటో ఎందుకు.?. దానిపై రాజముద్ర ఉండాలి. సైకో ఫోటో కాదు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని జగన్ పెడుతున్నారు. మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్లాలి. ఈ యాక్ట్ ద్వారా మీ భూమి మీరు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏ పాలన కావాలి.?
'మీకు విధ్వంస పాలన కావాలా.? అభివృద్ధి పాలన కావాలా.? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా.? లేదా గంజాయి, డ్రగ్స్ కావాలా.?. నడిపించే నాయకుడు కావాలా.? నరరూప రాక్షసుడు కావాలా.?. విలువ ఇచ్చే సీఎం కావాలా.? నియంత కావాలా.?' అనేది ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైకో జగన్ ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. విధ్వంస పాలనకు ఓటుతో చరమగీతం పాడాలని అన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
జాబు కావాలా.. గంజాయి కావాలా ? నడిపించే నాయకుడు కావాలా ? నరరూప రాక్షసుడు కావాలా ? విలువ ఇచ్చే సీఎం కావాలా ? నియంత కావాలో! ప్రజలు ఆలోచించుకోవాలి.#JaruguJagan #APSaysByeJagan #BabuForAP #PrajaGalam#TDPJSPBJPWinning #MyVoteForBabu #ChandraBabu #BabunuMalliRappidham… pic.twitter.com/yJMsu4gjfb
— Telugu Desam Party (@JaiTDP) May 11, 2024
ఇంకో రెండు రోజులు.. జగన్ ని ఇంటికి పంపించే రోజు.. సైకోని వదిలించుకునే రోజు...#JaruguJagan #APSaysByeJagan #BabuForAP #PrajaGalam#TDPJSPBJPWinning #MyVoteForBabu #ChandraBabu #BabunuMalliRappidham #AndhraPradesh pic.twitter.com/l7EKWZNWLG
— Telugu Desam Party (@JaiTDP) May 11, 2024
'సీమ ప్రజలను మోసం చేశారు'
సీఎం జగన్ రాయలసీమ ప్రజలను మోసం చేశారని.. రాష్ట్రంలో నిత్యావసరాలు ధరలు పెరిగి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని మండిపడ్డారు. నంద్యాల సభ అనంతరం తిరుపతిలోని ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. 'వైసీపీకి 49 సీట్లు ఇచ్చిన రాయలసీమకు జగన్ ఏం చేశారు.?. జిల్లాలోని పదవులన్నీ పెద్దిరెడ్డికే కావాలి. కూటమి అధికారంలోకి రాగానే వారు దోచుకున్నదంతా వసూలు చేస్తాం. ఈ ఎన్నికల్లో స్మగ్లర్లకు జగన్ సీట్లు ఇచ్చారు. జగన్ పాలనలో కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు.?. మద్య నిషేధం పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇక్కడ మద్యం కొనలేక పక్క రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి ఖనిజ సంపద దోచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన వారిని వదిలిపెట్టను.' అని చంద్రబాబు వెల్లడించారు.
Also Read: Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ