అన్వేషించండి

Sharmila On Avinash : న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటం - కమలాపురంలో షర్మిల కీలక వ్యాఖ్యలు

Andhra Politics : కడప జిల్లాలో షర్మిల విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అవినాష్ ను గెలిపిస్తే ఆయనను కలవాలంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

Elections 2024 :  కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు   .. అవినాష్ రెడ్డి గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా కమలాపురం నియోజకవర్గంలో   కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ప్రచారం నిర్వహించారు.  న్యాయానికి - నేరానికి మద్య జరుగుతున్న పోరాటం కడప ఎన్నికలని స్పష్టం చేశారు.   

పంచడానికి తన వద్ద డబ్బు లేదని.. YSR బిడ్డగా మీ ప్రేమ అభిమానం తన సొంతమన్నరు. రవీంద్రనాథ్ రెడ్డి  ఎంత డబ్బులు ఇచ్చినా నా కోసం తీసుకోండి.. నా మేనమామ నాకోసం ఇస్తాడు..ఎంత ఇచ్చినా తీసుకోండని సూచించారు. మేనమామ కి భాధ్యత ఉంటుంది కదా సెటైర్ వేశారు.  రవీంద్రనాథ్ రెడ్డి కి ఓటు వేశారు ఒక్క పని అయినా చేశారా  అని ప్రజలను ప్రశ్నించారు.  GNSS ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం అన్నారు..తట్టెడు మట్టి తియ్యలేదన్నారు.  సర్వారాయ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదు. సర్వారాయ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఏమో కానీ... రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువు,రొయ్యల చెరువు కి నీళ్ళు వస్తున్నాయని మండిపడ్డారు. 

ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమని ఎమ్మెల్యే రవీంద్రనాథ్  రెడ్డిని ప్రశ్నించారు. అధికారం ఉన్నది మీ చెరువులు నింపుకోడానికా ? కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు. విశాఖ స్టీల్ ఎంత ముఖ్యమో...మనకు కడప స్టీల్ అంత ముఖ్యమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు అయినా వచ్చేవని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేశారు.. మొదటి 5 ఏళ్లు బాబు మోసం చేశారు ..బాబు చేసిన అభివృద్ధి ఏమి లేదని YSR వారసుడు జగన్ ను గెలిపిస్తే చేసింది ఏంటని ప్రశ్నించారు. YSR హయాంలో 54 ప్రాజెక్ట్ లు మొదలు పెట్టారు 2014 నాటికి 42 పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.. జగన్ YSR వారసుడు అయితే... జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు కట్టలేదని ప్రశఅనించారు. 

YSR హయాంలో మెగా డీఎస్సీ వేశాడు..పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశాడు  జగన్ 23 వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి దగా డీఎస్సీ చేశాడు.. 6 వేల ఉద్యోగాలకు దగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్తున్నాడు ..ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు భర్తీ కాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.35లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశాడుని ..అధికారం ఇస్తే శాఖల పరిధిలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల పరిధిలో 2.25లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. 

రాష్ట్రం అంతా మాఫీయా మయం అయిందని  లిక్కర్ మాఫియా,డ్రగ్స్ మాఫీయా,గంజాయి మాఫీయా,ఇసుక మాఫియా,మట్టి మాఫీయా దోచుకుంటోందన్నారు. 10 ఏళ్లలో మన రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని ఆరోపించారు.  వైఎస్ వివేకా జగన్ ను ఆయన కొడుకు అనుకున్నారు. సొంత కొడుకు లాంటి వాడి వాడు హంతకులను కాపాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. CBI దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. కాల్ రికార్డ్స్ ఉన్నాయి..హత్యకు ముందు డీల్ మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయి..ఇన్నీ ఆధారాలు ఉన్నా..నిందితుడు అవినాష్ రెడ్డి ని కాపాడుతున్నారన్నారు.  CBI ను సైతం మేనేజ్ చేస్తున్నారు.. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదన్నారు.  కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా? నేరం వైపు నిలబడతారా ? ఆలోచన చేసి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Rajasthan Panchayat Polls: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
AP ZP Chairpeson Elections: జడ్పీ పీఠాలపై కూటమి ఘన విజయం.. 27 జిల్లాల్లో పాగా, కొత్త ఛైర్‌పర్సన్ల పూర్తి జాబితా ఇదే!
జడ్పీ పీఠాలపై కూటమి ఘన విజయం.. 27 జిల్లాల్లో పాగా, కొత్త ఛైర్‌పర్సన్ల పూర్తి జాబితా ఇదే!
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
CM Chandrababu: స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget