Punjab Election 2022: పంజాబ్‌లో కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. 2 స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీకి దిగుతున్నారు. భదౌర్‌తో పాటు చమ్‌కౌర్ సాహెబ్ స్థానాల నుంచి చన్నీ బరిలోకి దిగుతున్నారు.
Congress releases its third list of 8 candidates for Punjab Assembly elections
— ANI (@ANI) January 30, 2022
CM Charanjit Singh Channi to contest from Bhadaur constituency also. The party had earlier announced his candidature from Chamkaur Sahib seat pic.twitter.com/O7bPAWsS80
మరో సీనియర్ నేత సుఖ్‌పాల్ సింగ్ భులార్.. ఖీమ్ కరణ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బర్నాలా నుంచి మనీశ్ బన్సాల్, పటియాలా నుంచి విష్ణు వర్మకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.
ఫిబ్రవరి 20న..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ముందుగా ఫిబ్రవరి 14న జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీని మార్చాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో ఎన్నికలను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.
కొత్త షెడ్యూల్..
- నోటిఫికేషన్ తేదీ: January 25, 2022 (మంగళవారం)
- నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: February 1, 2022 (మంగళవారం)
- నామపత్రాల పరిశీలన: February 2, 2022 (బుధవారం)
- నామపత్రాల ఉపసంహరణకు చివరి తేదీ: February 4, 2022 ( శుక్రవారం)
- పోలింగ్ తేదీ: February 20, 2022 ( ఆదివారం)
- ఓట్ల లెక్కింపు: March 10, 2022 ( గురువారం)
ఆప్ పోటీ..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికీ పలు సర్వేలు వెల్లడించాయి. ఆమ్‌ఆద్మీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఈ సర్వేలు తెలిపాయి. అయితే హంగ్ ఏర్పడే అవకాశమే ఎక్కువ ఉందని ఏబీపీ-సీఓటర్ సర్వే వెల్లడించింది.
Also Read: NeoCoV Variant: నో టెన్షన్.. 'నియోకొవ్'కు అంతలేదట..! చైనా శాస్త్రవేత్తలే కాస్త మసాలా జోడించారట!
Also Read: Goa Poll 2022: 'రాహుల్ గాంధీకి 'మోదీ ఫోబియా' పట్టుకుంది.. గోల్డెన్ గోవా మాకే సాధ్యం'