అన్వేషించండి

Visakha East: వెలగపూడి అడ్డా విశాఖ తూర్పు - ఈసారి గెలుపు ఎవరిదో?

In Velagapudi Adda Visakha East.. Will the YCP flag fly? : విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ తూర్పు. ఇది కూడా నగర పరిధిలోని నియోజకవర్గమే. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే ఏర్పాటైంది.

Present Political Scenario in Visakha East: విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ తూర్పు. ఇది కూడా నగర పరిధిలోని నియోజకవర్గమే. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మూడుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధిస్తూ వచ్చారు. హ్యాట్రిక్‌ విజయాలతో ఊపు మీద ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు నాలుగో ఎన్నికల్లోనూ గెలుపు తనదే అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. టీడీపీ, వెలగపూడి రామకృష్ణబాబుకు కంచుకోటగా ఉన్న తూర్పు నియోజకవర్గంపై వైసీపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగురేయాలన్న ఉద్ధేశంతో ఇక్కడ బలమైన వ్యక్తిని బరిలోకి దించుతోంది. ప్రస్తుతం విశాఖ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణబాబుపై పోటీకి సిద్ధపడుతున్నారు. 

అత్యధిక సంఖ్యలో ఓటర్లు

నగర పరిధిలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా విశాఖ తూర్పు ఉంది. ఇక్కడ 3,51,695 మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. వీరిలో 1,72,707 మంది పురుష ఓటర్లు కాగా, 1,78,971 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషలతో పోలిస్తే మహిళా ఓటర్లు సంఖ్య దాదాపు ఆరు వేలు ఉంది. వీరు ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వారే విజయం సాధించే అవకాశముంది. 

ఇవీ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గం కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి భారీగా మెజార్టీ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం రాష్ట్రమంతా ఉన్నా.. ఇక్కడ టీడీపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌పై 4,031 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి వెలగపూడి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వెలగపూడి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌పై 47,883 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మూడోసారి వెలగపూడి రామకృష్ణబాబు విజయాన్ని దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అక్కరమాని విజయనిర్మలపై 26,474 ఓట్ల తేడాతో గెలుపొందారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget