అన్వేషించండి

Mylavaram Assembly Constituency: వామపక్షాల కంచుకోటపై కాంగ్రెస్ పాగా వేయగా....వారి ఆశలకు టీడీపీ గండికొట్టింది

Andhra Pradesh News: కాంగ్రెస్ కంచుకోట మైలవరానికి తెలుగుదేశం చెక్‌పెట్టగా...గత ఎన్నికల్లో పచ్చజెండాకు వైసీపీ గండికొట్టింది. ఇప్పుడు మైలవరం ప్రజలు ఎవరి పక్షమో..?

NTR District News: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం (Mylavaram Assembly Constituency) 1955లో ఏర్పాటు చేయగా.. తొలుత కమ్యూనిస్టులు ప్రభావం చూపారు. ఆ తర్వాత కాంగ్రెస్(Congress) కంచుకోటగా మారింది. తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు పాగా వేయగా....ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు.

కమ్యూనిస్టుల కోట
ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1955లో మైలవరం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District) వ్యాప్తంగా వామపక్షాల ప్రభావం అధికంగా ఉండటంతో...ఇక్కడ సైతం సీపీఐ(CPI) పార్టీ అభ్యర్థి వెల్లంకి విశ్వేశ్వరరావు కేవలం 84 ఓట్ల తేడాతో కాంగ్రెస్(Congress) అభ్యర్థి పెడర్ల వెంకటసుబ్బయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1962 ఎన్నికల్లోనూ అదే అభ్యర్థులు పోటీపడగా..సీపీఐ ఈ సీటు నిలబెట్టుకుంది. అప్పుడు విశ్వేశ్వరరావు 514 ఓట్లతో  విజయం సాధించారు. 1967లో తొలిసారి కాంగ్రెస్ తరపున చనుమోలు వెంకట్రావు(Chanumolu Venkatarao) జయకేతనం ఎగురవేశారు. దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ సాధించారు....1972, 78లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.

తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్(NTR) ప్రభావం చూపగా....ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ సత్యనారాయణ విజయం సాధించారు. 4వేల 200 ఓట్ల మెజార్టీతో చనుమోలు వెంకట్రావుపై గెలుపొందారు.  ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ చనుమోలు వెంకట్రావు  నిమ్మగడ్డ సత్యనారాయణను ఓడించారు.. 1989లో కోమటి భాస్కర్‌రావు కాంగ్రెస్‌ తరఫున....తెలుగుదేశం నుంచి జేష్ఠ రమేశ్‌బాబు పోటీపడగా...కాంగ్రెస్‌ను విజయం వరించింది. 1994 లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో మైలవరంలోనూ  ఆ పార్టీ అభ్యర్థి జేష్ఠ రమేష్‌ 7వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

1999లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుకు తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా...కాంగ్రెస్‌ నుంచి కోమటి సుబ్బారావుపై విజయం సాధించారు. 2004లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేయగా...ఆ పార్టీ సీనియర్  కాంగ్రెస్‌ నుంచి చనుమోలు వెంకట్రావు ఐదోసారి గెలుపొందారు. 2009లో తెలుుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీపడగా... కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌పై విజయం సాధించారు. నందిగామ ఎస్సీ రిజర్వ్‌డు కావడంతో దేవినేని ఉమ (Devineni Uma) మైలవరం నుంచి బరిలో దిగాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో వరుసగా రెండోసారి గెలిచిన దేవినేని ఉమ...చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడోసారి మైలవరం నుంచి దేవినేని ఉమ పోటీపడగా...గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) రంగంలోకి దిగి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ(YCP) వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా...ప్రస్తుతం మైలవరం టిక్కెట్‌ ఆయకే కేటాయించారు. వైసీపీ తరపున సరనాల తిరుపతిరావు యాదవ్‌((Tirupati Yadav) బరిలో దిగారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి వసంతపై తిరుపతిరావు యాదవ్‌ ఏ మేరకు నెట్టుకురాగలరో చూడాలి.

నియోజకవర్గ స్వరూపం
మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలంలో కొంత భాగం మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. జనరల్ కేటగిరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు  2,80,000  మంది ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget