అన్వేషించండి

Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

Kerala Elections 2026:ప్రవాస ఓటర్ల ప్రభావం కేరళ అంతటా ఉన్నప్పటికీ మలబార్‌ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. కోజికోడ్‌లో 57, 679 మంది NRIలు ఉన్నారు. కన్నూర్‌లో 52, 163 మంది, మలప్పురంలో 39, 501 మంది ఉన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్నికల్లో గెలుపు కోసం ప్రవాస భారతీయులను రప్పించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
  • గల్ఫ్ దేశాల నుంచి ఓటర్లను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
  • ప్రవాస ఓటర్లు, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో, ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపగలరు.
  • చార్టర్డ్ విమానాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు, భద్రతా పరిస్థితులు కీలకం కానున్నాయి.

Kerala Assembly Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మన రాష్ట్రంలో సర్పంచ్, లోకల్ బాడీ ఎన్నికలకు కనిపించే హడావుడి అక్కడ కనిపిస్తోంది. వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసి బస్‌లు వేసి రప్పించిన దృశ్యాలు సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో చూస్తాం. కాని ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారిన పరిస్థితుల్లో అభ్యర్థుల జాతకాలను మార్చగల శక్తి ఉన్న ప్రవాస భారతీయులను రప్పించేందుకు పార్టీలు తాపత్రయ పడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న ఓటర్లను కేరళకు రప్పించేందుకు ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. 

గల్ఫ్‌ ఓటర్లే ఎందుకు కీలకం?

కేరళ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.23 లక్షల మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. సంఖ్య పరంగా ఇది తక్కువగా అనిపించినా హోరాహోరీ సాగే పోరులో వీటి ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్నాయి. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అనేక నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ చాలా స్వల్పంగా ఉంది. అటువంటి చోట్ల విదేశాల నుంచి వచ్చే వేల ఓట్లు అభ్యర్థుల భవిష్యత్‌ను తలకిందులు చేస్తాయి. 

ఛార్టర్డ్‌ విమానాల వ్యూహంతో బరిలోకి దిగిన కాంగ్రెస్, ముస్లిం లీగ్‌

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రవాస మలయాళీలు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి ఓటు వేస్తుంటారు. అయితే ఈసారి విమాన సర్వీసులు తగ్గింపు, విపరీతంగా పెరిగిన విమాన టికెట్ ధరలు వారిని వెనక్కి లాగుతున్నాయి. ఈ అడ్డంకిని తొలగించేందుకు కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ పార్టీలు చార్టర్డ్ విమానాలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. 

పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ప్రవాస ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా ముస్లిం లీగ్ ఉత్తర కేరళకు చార్టర్డ్ విమానాలు నడిపిన అనుభవం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ముస్లిం లీగ్ విదేశీ విభాగమైన కేరళ ముస్లిం కల్చరల్‌ కమిటీ ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని మలయాళీలను సమన్వయం చేసే పనిలో నిమగ్నమైంది. పోలింగ్ తేదీలకు సమీపంలో ఈ విమానాలను నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

కేరళ కాంగ్రెస్ కూడా చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ సదుపాయం కేవలం అధిక విమాన ఖర్చులను భరించలేని కార్మిక వర్గ ఓటర్లు కోసమేనని చెబుతున్నారు. 

మలబార్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి 

ప్రవాస ఓటర్ల ప్రభావం కేరళ అంతటా ఉన్నప్పటికీ మలబార్‌ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. కోజికోడ్‌లో 57, 679 మంది NRIలు ఉన్నారు. కన్నూర్‌లో 52, 163 మంది, మలప్పురంలో 39, 501 మంది ఉన్నారు. ఈ మూడు జిల్లాలలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు విదేశాల్లో ఉన్నారు. వీరంతా ఓటు వేసేందుకు రాగలిగితే ఎన్నికల ఫలితాలు ఒక వైపుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రాజకీయ పార్టీలు తమ కేడర్‌ను గల్ఫ్ దేశాల్లో ఉత్సాహపరుస్తూ వారిని స్వదేశానికి పంపేలా ప్రోత్సహిస్తున్నాయి. 

చట్టపరమైన సవాళ్లు

చార్టర్డ్ విమానాలు నడపటం అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికే విమానయాన సంస్థలు ఒక కండిషన్ పెట్టాయి. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు పొందితేనే విమానాలు నడపడం సాధ్యమవుతుందని స్పష్టం చేశాయి. అంతేకాకుండా పశ్చిమాసియాల కొనసాగుతున్న ఉద్రిక్తతకు కూడా ఈ ప్రయాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఈ భారీ ఆపరేషన్ కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదు, గల్ఫ్‌ మలయాళీలకు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ చార్టర్డ్ విమానాలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయనేది ఇప్పుడు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. 
  

Frequently Asked Questions

కేరళ ఎన్నికలలో ప్రవాస భారతీయులు ఎందుకు కీలకం?

కేరళలో మొత్తం 2.69 కోట్ల ఓటర్లలో 2.23 లక్షల మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. హోరాహోరీగా సాగే పోరులో వీరి ఓట్లు గెలుపోటములను నిర్ణయించగలవు.

ప్రవాస ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి?

విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు ప్రవాస ఓటర్లను తరలించడానికి ప్రత్యేక చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నాయి.

మలబార్ ప్రాంతంపై పార్టీలు ఎందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి?

కోజికోడ్, కన్నూర్, మలప్పురం జిల్లాలలో అత్యధిక సంఖ్యలో ప్రవాస ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవు కాబట్టి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

చార్టర్డ్ విమానాల ఏర్పాటులో ఎలాంటి చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి?

గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి అవసరమైన అనుమతులు పొందడం, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు వంటివి చార్టర్డ్ విమానాల ఏర్పాటులో సవాళ్లుగా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget