అన్వేషించండి

Jeevan Reddy : మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు : జీవన్‌రెడ్డి

Congress MLC Jeevan Reddy: బుల్డోజర్‌తో రామాలయాన్ని కూల్చేస్తామంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం దారుణమని, రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జీవన్‌ రెడ్డి విమర్శించారు.

Jeevan Reddy About PM Modis Comments: ప్రధాని నరేంద్ర మోదీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. బుల్డోజర్‌తో అయోద్య రామాలయాన్ని కూల్చేస్తామంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం దారుణమన్న జీవన్‌ రెడ్డి.. ఈ తరహా వ్యాఖ్యలు మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుల్డోజర్‌ను తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అన్న జీవన్‌ రెడ్డి.. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌ పార్టీ అని, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీవ్‌ గాంధీ బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని స్పష్టం చేశారు. 

ఎన్నికల కోసం దేవుడిని వాడొద్దు

ఎన్నికల వచ్చిన ప్రతిసారి దేవుడిని వాడుకోవడం బీజేపీకి పరిపాటిగా మారిందని, ఇది మంచి పద్ధతి కాదని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. మత సామరస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్న జీవన్‌ రెడ్డి.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దూరదర్శన్‌లో రామాయణ, మహాభారతాలు ప్రసారం చేశారని, ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించుకోవాలని సూచించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చిన తరువాతే రామాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగినట్టు ప్రచారం చేసుకోవడం తగదన్న జీవన్‌ రెడ్డి.. కోర్టు తీర్పు ప్రకారమే ఆలయ నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తించాలన్నారు.

మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇంకా ఎన్నాళ్లు ఈ తరహా రాజకీయాలు చేస్తారంటూ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసం బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన అభివృద్ధి, ఇతర అంశాలతో రాజకీయాలు చేయాలని, మత ప్రాతిపదిక రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలని జీవన్‌రెడ్డి సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Election Results Live Updates: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఒక్క ఓటుతో చింతల జూటూరు సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు విజయం
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఒక్క ఓటుతో చింతల జూటూరు సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు విజయం
AP Panchayat Elections: ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
AP Panchayat Elections: బలవంతపు ఏకగ్రీవాలు జరగొద్దు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: ఏపీ ఎస్‌ఈసీ
బలవంతపు ఏకగ్రీవాలు జరగొద్దు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్‌ఈసీ
AP Urban Local Body Elections: 87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు
87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget