అన్వేషించండి

Telangana Panchayat Polling: తెలంగాణలో మొదలైన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

Telangana Panchayat Polling: తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడు వేలకుపైగా సర్పంచ్ పదవుల కోసం ఓటింగ్ జరుగుతోంది.

Telangana Panchayat Polling: తెలంగాణలో సుదీర్ఘంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం తుది దశకు చేరింది. మూడో విడత పోలింగ్‌తో పల్లెపోరుకు తెరపడింది. రాష్ట్రంలోని 18 మండలాల పరిధిలో ఉన్న 3752 పంచాయతీల సర్పంచ్‌లకు పోలింగ్‌ జరుగుతోంది.ఈ తుదిదశ పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. 

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఏజెంట్ల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు. ముందుగా సర్పంచ్‌ వార్డు సభ్యులు ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణంతో ఓన్నిక వాయిదా పడితే గురువారం పోలింగ్ నిర్వహిస్తారు.  

తెలంగాణలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మూడో విడతను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఏర్పాట్లు చేసింది. ఈ మూడో విడత ఎన్నికల్లో 3752 సర్పంచ్ పదవుల కోసం 12, 652 మంది బరిలో ఉన్నారు. 28, 410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 75, 725మంది పోటీ పడుతున్నారు. వీళ్లను ఎన్నుకోవడానికి 53 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26 లక్షల మంది అయితే స్త్రీలు 27 లక్షల మంది ఉన్నారు. ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు 36, 483 పోలింగ్ కేంద్రాలను ఎస్‌ఈసీ అధికారులు ఏర్పాటు చేశారు. 

మూడో విడతలో మొత్తంగా 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. దాదాపు ఎనిమిదివేల వార్డు సభ్యులు కూడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేశారు. ముందు జాగ్రత్తగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న వారి ఆయుధాను స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల విలువైన నగదు, నాలుగు కోట్ల విలువైన మద్యం, కోటి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.  
 
టాప్ హెడ్ లైన్స్

GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget