అన్వేషించండి

ABP CVoter Opinion poll Telangana : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?

ABP CVoter Survey : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ఎక్కువ సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైన అంచనాలు ఇవే

ABP CVoter Opinion Poll 2024 :  తెలంగాణలో నాలుగు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో డబుల్ డిజిట్ సీట్స్ సాదించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. అంత కంటే తక్కువ సీట్లు సాధిస్తే ప్రభుత్వ మనుగడకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అదే సమయంలో బీజేపీ తాము ఎంతో బలపడ్డామని నమ్ముతోంది. తమకూ డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని అనుకుంటోంది. ఇక  నాలుగు నెలల కిందటి వరకూ ఎంతో బలంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అయితే పది నుంచి  పన్నెండు సీట్లు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని అనుకుంటున్నారు. మరి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? . దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన సర్వేల్లో ఒకటి అయిన ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ABP CVoter Opinion poll Telangana : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 10 లోక్ సభ సీట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నెలల వ్యవధిలోనే పేదలకు లబ్ది కలిగే గ్యారంటీలను అమలు చేయడానికి ప్రయత్నించడం పాజిటివ్ గా మారిందని అనుకోవచ్చు కరువు పరిస్థితులు వెంటాడినా.. విపక్షాలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నా.. ప్రభుత్వంపై వారు చెబుతున్నంత వ్యతిరేకత పెరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్లుగా పది లోక్ సభ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు  ఉన్నాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. 

ప్రధాన ప్రతిపక్షంగా ఇక బీజేపీనే - ఆ పార్టీకి ఐదు  లోక్ సభ సీట్లు

తెలంగాణలో రాజకీయం మారిపోయిందని .. ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ వెల్లడిస్తోంది. రెండో స్థానంలో బీజేపీ ఉంటుందని వెల్లడయింది.  బీజేపీకి తెలంగాణలో ఇంతకు ముందు నలుగురు ఎంపీలు ఉండగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య ఐదుకు చేరుతుందని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. మరో స్థానం మాత్రమే అదనంగా గెల్చుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. 

భారత రాష్ట్ర సమితికి ఒక్క సీటే 

భారత రాష్ట్ర సమితికి ఒక్కటంటే ఒక్క సీటు వస్తుందని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత ఎక్కువగా బలహీనపడింది. ఈ ప్రభావం ఓటింగ్ పై పడుతుంని తేలింది. 

కాంగ్రెస్‌కు 41.5 శాతం ఓట్లు 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించబోతోంది. ఓట్ల శాతం కూడా పెరనుందని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. నాలుగు నెలల కిందటే అధికారంలోకి రావడంతో .. ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలు రావడం కాంగ్రెస్‌కుఓ రకంగా కలసి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

బీజేపీ కన్నా బీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు 

కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓట్లను సాధించేది బీఆర్ఎస్ పార్టీనేనని  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఆ పార్టీకి 26.7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ కన్నా దాదాపుగా ఒక్క శాతం తక్కువగా 25.7 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. అయితే  బీజేపీ ఓట్లు అన్నీ కొన్ని చోట్ల కన్సాలిడేట్ అవడం వల్ల ఐదు  సీట్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఓట్లన్నీ అన్నీచోట్లా ఉండటం వల్ల ఒక్క స్థానానికే పరిమితమవుతున్నట్లుగా  తెలుస్తోంది. 


(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
Embed widget