అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP Elections Counting 2024: ఆంధ్రప్రదేశ్‌లో 144 సెక్షన్- కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎన్నికల సంఘ ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. ఇదే పరిస్థితి ఎన్నికల కోడ్ ముగిసే వరకు కొనసాగిస్తామన్నారు.

AP Assembly Elections Counting 2024 Updates:  ఆరు రోజులే ఇంకా ఆరు రోజులే. కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి సందేహాలు, పార్టీ అంచనాలు, గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తోంది. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఓవైపు ప్రజలను, నేతలను గ్రిల్ చేస్తుంటే కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారులను వేధిస్తోంది. ఎవరి ప్లాన్ ఏంటీ... ఎవరి మదిలో ఏముంది ఎవరు ఎక్కడ ఎలాంటి విధ్వంసానికి దిగుతారో అన్న అనుమాన వారిలో ఉంది. అందుకే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాలను భారీగా ఈసారి రంగంలో దింపుతోంది ఎన్నికల సంఘం. 

20 కంపెనీల కేంద్ర బలగాల 

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 20కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్‌లోకి దింపుతోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రితోపాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అణువణువూ గాలించి అనుమానితలను అదుపులోకి తీసుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 

కేంద్ర బలగాలు ఉన్న ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 144 సెక్షన్ వధిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు ప్రజల రోజు వారి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో జూన్‌ ఆరో తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉంది. అదే టైంలో బాణాసంచాపై కూడా ఆంక్షలు పెట్టారు. 

విస్తృత తనిఖీలు 

లెక్కింపు రోజున ఘర్షణలు జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకుటోంది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తోంది. కార్డన్ సెర్చ్ పేరిట తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటోంది. బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారిని వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తోంది. వారికి కౌన్సిలింగ్ ఇస్తోంది. మరోవైపు పేలుడు పదార్థాలు, ఇతర మారణాయుధాయలపై కూడా నిఘా పెట్టింది పోలీసు శాఖ. 

కార్డన్ సెర్చ్‌లో భాగంగా కాలం చెల్లిన వాహనాలను, ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అనుమానం ఉన్నప్రాంతంలో ప్రతి ఇంచ్ వెతుకుతున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు మొదటి సారి జరుగుతున్నందున ప్రజలు కాస్త ఆందోళన చెందుతున్నారు.  

అదుపులో శాంతి భద్రతలు 

పోలీసు శాఖ, ఇతర అధికారులు, సిట్ బృందాల ఆధ్వర్యం చేపట్టిన చర్యలు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి... ఎన్నికల కోడ్‌ తొలగిపోయే వరకు ఇదే పరిస్థిత కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మీనా వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget