Bhongir Election Results 2024: భువనగిరి కాంగ్రెస్ హస్తగతం, బీజేపీ అభ్యర్థిపై 2 లక్షలకు పైగా మెజారిటీ
Bhongir Lok Sabha Election Results 2024: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి జోరు ప్రదర్శించారు. ఇక్కడ ఆయన 2 లక్షలకు పైబడి మెజారిటీ సాధించారు.
Bhongir Lok Sabha Elections 2024: భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చలమల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 222170 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. చలమల కిరణ్ కుమార్ రెడ్డికి 629143 ఓట్లు పోలయ్యాయి. బూర నర్సయ్య గౌడ్ కు 406973 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కు 256187 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చలమల కిరణ్ కుమార్ రెడ్డి తొలి నుంచి ముందంజలో కొనసాగారు. ఉదయం 11 గంటల సమయానికి ఈయనకు 453938 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ 153067 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ 262324 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానానికి పరిమితం అయింది.