అన్వేషించండి

Bandi Sanjay : అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు

Telangana News : అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని కాంగ్రెస్ తనను ఎలా ఓడిస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు.

Telangana Politics :    ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. నేను మాట్లాడితే తప్పని ఎందుకంటున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రసశ్నించారు. తాను  వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు.  కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా నేటికీ తేల్చుకోలేని నాయకులు తనను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.‘‘ఇక్కడున్నాయన పార్టీకి,  సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయిస్తడు. ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయితున్నరు. ఇయాళ  పోటీగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తడట.. రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ. ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేకపోతున్న నేతలు నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.  చొప్పదండి నియోజకవర్గంలో పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. 
  
ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదు. పోనీ ఎన్నికల కోడ్ అయిపోగానే జూన్ 4న రుణమాఫీ చేయొచ్చు కదా.. ఎందుకు చేయరు? పార్లమెంట్ ఎన్నికలైపోంగనే స్థానిక సంస్థలు కూడా నిర్వహించి ఓట్లు దండుకున్నా.. రుణమాఫీసహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది. అందుకే ఈ కపట నాటకమాడుతూ దేవుడిమీద ఓట్టేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ హామీలివ్వకపోతే... అవి నెరవేర్చేదాకా కొట్లాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. బోనస్ ఇచ్చేదాకా వెంటాడతాం. తాలు, తరుగు, తేమతో పని లేకుండా వడ్లు కొనాలంటే రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. వడ్లకు బోనస్ కోసం రూ.3,500 కోట్లు అవసరమవుతాయి. వీటినే ఖర్చు చేయలేనోళ్లు రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తానంటే నమ్మేదెవరు? వీటి కోసం కొట్లాడి కాంగ్రెస్ మెడలు వంచేదాకా పోరాడేది బీజేపీయే. కేసీఆర్ సర్కార్ మోసాలను ఎండగట్టి ఫాంహౌజ్ లో పడుకున్నోడిని ధర్నా చౌక్ కు గుంజుకొచ్చినానే అక్కసుతో నన్ను ఓడగొట్టాలని కుట్ర చేస్తున్నడని మండిపడ్డారు.  

  6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను నిలదీస్తుంటే... నన్ను ఓడించాలని బీఆర్ఎస్ తో కలిసి ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నరు.. నేనడుగుతున్న నేనడుగుతున్నా... మహిళలకు నెలనెలా రూ.2,500లు బ్యాంకులో జమ చేస్తామన్నరు. ఎందుకు ఇవ్వలేదు? వ్రుద్దులు, వితంతవులు, బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచి నెలనెలా ఇస్తామని ఎందుకివ్వలే? ఇండ్లు లేని వాళ్లందరికీ ఇంటిజాగాతోపాటు  5 లక్షల సాయమందిస్తామని ఇంతవరకు ఒక్కరికైనా ఇచ్చారా? రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా కింద 15 వేల ఆర్దిక  సాయం, రైతు కూలీలకు 12 వేల సాయమందిస్తామన్నారు. రైతులు అల్లాడుతున్నా ఎందకు బోనస్ ఇవ్వలేదు? విద్యార్థులకు 5 లక్షల  భరోసా కార్డు ఇచ్చి చదువుపై భారం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 

ఒక్కరంటే ఒక్క విద్యార్ధికైనా భరోసా కార్డు ఇచ్చారా?రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తాం. వడ్లు, మిర్చి, మొక్కజొన్న, మిర్చి, పసుపు సహా పంటలకు క్వింటాలుకు 5 వందల చొప్పన బోనస్ ఇస్తామన్నరు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తామన్నరు. వడ్ల కల్లాల వద్ద రైతులు అల్లాడుతున్నరు. ఎంతమందికి బోనస్ ఇచ్చారు? ఎంత మంది వద్ద తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లు కొన్నారు? బీఆర్ఎస్ హయాంలో మూసివేసిన 6 వేల స్కూళ్లను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని స్కూళ్లు తెరిపించారు?స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో నిధులు, విధులు అప్పగిస్తామన్నారు. ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మోదీ బాత్రూంలే కాదు.. అన్ని కట్టించిండు. మోదీ ఇండ్ల కోసం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు. పంచాయతీలకు వేల కోట్ల నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం ఇస్తుంటే కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నరు... ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ రాచిరంపాన పెట్టిండని గుర్తు చేశారు.  కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో నేటికీ తెలియదు. ఒకాయన పార్టీకి,  సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయించాడట. ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయ్యిందట. ఇయాళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తడట.. రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేకపోతున్న నేతలు బీజేపీని ఓడిస్తామని బీరాలు పలుకుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవాచేశారు. 

టాప్ హెడ్ లైన్స్

TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget