అన్వేషించండి

NDA Alliance Victory Factors: ఏపీ పుర ఫలితాల్లో కూటమి ప్రభంజనం - అఖండ విజయం వెనుక ప్రధాన కారణాలు ఇవేనా!?

AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఏకపక్ష విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ వైఫల్యాలు, కూటమి సఖ్యత వల్ల ఇది సాధ్యమయింది.

YSRCP Defeat In AP Urban Local Body Polls:   ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలోనే ఏకపక్ష తీర్పును ప్రతిబింబించాయి.  మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు , నగర పంచాయతీలలో అధికార ఎన్డీయే కూటమి  తన తిరుగులేని ఆధిపత్యంతో సునామీ తరహా విజయాన్ని నమోదు చేసుకుంది. సాధారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలకే అత్యధికంగా రూలింగ్ అడ్వాంటేజ్  లభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, నిధుల సాధికారత, వార్డుల అభివృద్ధిపై ఆశలు పట్టణ ఓటర్లను అధికార కూటమి వైపే నిలబడేలా చేశాయి. అయితే, కేవలం అధికార బలం మాత్రమే కాకుండా ఈ విజయం వెనుక అనేక లోతైన రాజకీయ సమీకరణాలు పనిచేశాయని   భావిస్తున్నారు.

వైసీపీ క్యాడర్ ఇంకా నిరాశలోనే !

ఈ ఘనవిజయానికి ప్రధాన బలమైన కారణాలలో మొదటిది అసెంబ్లీ ఎన్నికల దెబ్బ నుంచి వైఎస్సార్‌సీపీ   కోలుకోలేకపోవడం. సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం ఆ పార్టీలో నెలకొన్న నైరాశ్యం, స్థానిక నాయకత్వాల్లో వచ్చిన స్పష్టమైన డీమోరలైజేషన్ క్షేత్రస్థాయి ఫలితాలపై పడింది. వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్ ఆశించిన స్థాయిలో ఆర్థిక, నైతిక బలాన్ని అందించుకోలేకపోయారు. ప్రతిపక్షం తన శ్రేణులను ఎన్నికల వేడికి సిద్ధం చేసి ఓటర్లను బూత్‌లకు తరలించే సమర్థవంతమైన ఎలక్షన్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల పట్టణాల్లో వ్యతిరేక ఓటు బ్యాంకు స్థిరీకరించబడలేదు.

కూటమి మధ్య సఖ్యత 

రెండవ బలమైన అంశం  అధికార ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య కొనసాగుతున్న ,  రోజురోజుకూ మరింత బలపడుతున్న రాజకీయ సఖ్యత. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలు సమన్వయాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాయి. సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ ,  జనసేన శ్రేణుల మధ్య విబేధాలు ఉన్నట్లు చూపుతూ, పొత్తుకు గండికొట్టేందుకు ఓ వర్గం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ డిజిటల్ నెరేటివ్‌లు లేదా దుష్ప్రచారాలు పట్టణ ఓటర్ల మూడ్‌ను ఏమాత్రం మార్చలేకపోయాయి. కూటమి నేతలు ఒకే సంకేతాన్ని పంపడం, వార్డు స్థాయిల్లోనూ సమన్వయంతో పోటీ పడటంతో అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీ సొంతమైంది.

ఈ ఫలితాలు వచ్చే ఎచ్చే ఎన్నికల్లో సానుకూలత కాదు!

అయితే, ఈ మున్సిపల్ ఫలితాలను రాబోయే అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి ముందస్తు కొలమానంగా లేదా సూచికగా పరిగణించలేమని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, స్థానిక ఎన్నికల ఓటింగ్ ప్రాధాన్యతలు ఎప్పటికీ వేరేగా ఉంటాయి. కార్పొరేషన్, మున్సిపల్ పోరులో నిత్యం కంటికి కనిపించే లోకల్ సమస్యలు, అభ్యర్థి వ్యక్తిగత సంబంధాలు, పారిశుధ్యం, వీధిదీపాలు, డ్రైనేజీ, స్థానికంగా లభించే ప్రభుత్వ ప్రాపకం ప్రాధాన్యత వహిస్తాయి. ఇక్కడ ఓటరు రాజకీయం కంటే తక్షణ అనుకూలతకే మొగ్గు చూపుతారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ సమరానికి వచ్చేసరికి ఓటరు ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ రాష్ట్రాభివృద్ధి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, పెద్ద ఎత్తున జరిగే సంక్షేమం, జాతీయ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. కాబట్టి స్థానిక ఎన్నికలలో దక్కిన ఈ సునామీ విజయాన్ని చూసి ఎన్డీయే కూటమి అతివిశ్వాసానికి పోవడానికి ఎంత అవకాశాలు లేవో, అలాగే వైఎస్సార్‌సీపీ ఈ ఫలితాలను చూసి పూర్తిగా నిరాశలో కూరుకుపోవాల్సిన అవసరమూ లేదు.

 ఆంధ్రప్రదేశ్ పట్టణ ఓటరు ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో అభివృద్ధి,  సుస్థిరతకు మద్దతుగా ఎన్డీయే కూటమికి పట్టంగట్టారు. ఈ తీర్పు కూటమి పాలనకు ప్రజల నుంచి లభించిన బలమైన ఆమోదముద్ర అయినప్పటికీ, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు రూపొందించుకోవడంలో ఈ ఫలితాలు కేవలం తాత్కాలిక సూచీలుగా మాత్రమే పనిచేస్తాయి.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget