అన్వేషించండి

Narsipatnam News: నర్సీపట్నంలో గెలుపు ఎవరిని వరించేనో, ఇక్కడ పోటీ చాలా ఆసక్తికరం!

Narsipatnam constituency : ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ద్విసభకు ఎన్నిక జరిగింది.

Who Will Win In Narsipatnam Constituency : ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం నర్సీపట్నం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ద్విసభకు ఎన్నిక జరిగింది. మొత్తంగా 16 సార్లు ఎన్నికలు జరగ్గా, రానున్న సార్వత్రిక ఎన్నికలతో 17వ ఎన్నిక ఇక్కడ జరగనుంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,47,816 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,22,208 మంది కాగా, మహిళా ఓటర్లు 1,25,606 మంది ఉన్నారు. 

16 ఎన్నికలు.. ఫలితాలు ఇవే

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను తీరును పరిశీలిస్తే.. సమాన స్థాయిలో విజయాలతో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ సమానంగా నిలిచాయి. ఇరు పార్టీలు ఏడుసార్లు చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం తరువాత జరిగిన పది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు విజయం సాధించగా, నాలుగుసార్లు కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 

1955లో తొలిసారి ఇక్కడ ద్విసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం పోతురాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎం పిచ్చయ్యపై 347 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన వీర్రాజుపై 7030 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్‌ లచ్ఛాపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 4893 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 

1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు మరోసారి వవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎల్‌ పాత్రుడిపై 14,848 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసి బి గోపాత్రుడిపై 11,042 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గోపాత్రుడు బోలెం విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 8560 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తిపై 811 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 10,955 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 

1996లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 12,327 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ రామచంద్రరాజుపై 8559 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన డీవీఎస్‌ నారాయణరాజుపై 23,930 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి ముత్యాలపాప తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 8287 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌పై 2338 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల ఉమా శంకర్‌ గణేస్‌ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 22,839 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఇక్కడ గడిచిన పది ఎన్నికలను పరిశీలిస్తే.. ఆరుసార్లు అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ బరిలో ఉన్నారు. వీరి పోటీ వచ్చే ఎన్నికల్లో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలుMS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Viral News: 'దీపావళి రోజున రాముని వేషధారణలో వస్తారా?' - శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ, కట్ చేస్తే!
'దీపావళి రోజున రాముని వేషధారణలో వస్తారా?' - శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఫుడ్ డెలివరీ, కట్ చేస్తే!
Embed widget