అన్వేషించండి

AP Elections 2024: వైసీపీ ఎన్నికల శంఖారావ సభకు పేరు ఖరారు

YSRCP Election Campaign: ఈ నెల 27న భీమిలిలో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు సీఎం జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

YSRCP Election Meeting : రానున్న సార్వత్రిక ఎన్నికలకు అధికార వైసీపీ(YCP) సన్నద్ధమవుతోంది. ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. తొలి ఎన్నికల సభను ఈ నెల 27న భీమిలి(Bheemil Or Bhimunipatnam)లో వైసీపీ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohane Reddy)హాజరుకానున్నారు. ఈ ఎన్నికల శంఖారావ సభకు వైసీపీ పేరును ఖరారు చేసింది. ’సిద్ధం’(Siddam) పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు.

భీమిలి ఎన్నికల శంఖారావం పేరుతో నిర్వహించే సభకు సంబంధించిన పోస్టర్లను వైసీపీ ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తదితరులు గురువారం విడుదల చేశారు. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) యువగళం ముగింపు సభను ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ సభతో ఒక్కసారిగా టీడీపీకి మైలేజ్‌ పెరిగినట్టు అయింది. దాన్ని తలదన్నేలా వైసీపీ ఈ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సుమారు మూడు లక్షల మందిని వైసీపీ నాయకులు సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎన్నికలకు ’సిద్ధం’ అంటూ సవాల్‌ విసిరేలా

వైసీపీ భీమిలిలో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభకు సిద్ధం అన్న పేరును ఖరారు చేయడం వెనుక వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్‌ విసరుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే హోరాహోరీగా అధికార, ప్రతిపక్షాలు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పటకే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనేక సభలు నిర్వహిస్తూ ప్రజల్లోక జోరుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ తొలి సభ ద్వారా తాము ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్‌ను ఇచ్చేందుకు ఈ పేరును ఖరారు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోరుకు తాము సిద్ధమన్న రీతిలో పోస్టర్‌ డిజైన్‌ కూడా ఉంది. సీఎం జగన్మోహన్‌రెడ్ది చిత్రంతోపాటు పిడికిలి పిగించిన చేతిని పోస్టర్‌లో డిజైన్‌ చేశారు. ఇది ఎన్నికల్లో వైసీపీ కేడర్‌ సాగించబోయే పోరాటానికి సంకేతంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు.. 

భీమిలిలో నిర్వహించనున్న సదస్సులు మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహణకు వైసీపీ సన్నద్ధమవుతోంది. భీమిలి సదసస్సు తరువాత రాజమండ్రితోపాటు అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించనుంది. ఒక్కో సదసస్సును కనీసం లక్ష నుంచి మూడు లక్షల మందితో నిర్వహించేందుకు వైసీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. భీమిలి సదస్సు తరువాత రాజమండ్రిలో సదస్సును వైసీపీ నాయకులు నిర్వహించనున్నారు. ఇక్కడ సదస్సును లక్ష మందితో నిర్వహించనున్నట్టు రాజమండ్రి ఎంపీ భరత్‌ తెలిపారు. మరో వారం రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అభ్యర్థులు ఖరారు తరువాత సీఎం జగన్‌తోపాటు అభ్యర్థులంతా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రజల్లో ఉండేలా సీఎం జగన్‌ కేండిడేట్స్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget