News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Cvoter Survey LIVE: యూపీ, మణిపుర్‌లలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ.. గోవాలో హంగ్.. పంజాబ్‌లో ఆప్ కింగ్!

ABP Cvoter Survey LIVE Updates: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ABP- సీఓటర్ చేసిన ఒపీనియన్ పోల్ ఫలితాలు ఇవే

FOLLOW US: 
యూపీ ఫలితాలు..

దేశంలో కీలకంగా భావిస్తోన్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా విజయఢంకా మోగించే అవకాశం ఉందని తాజాగా చేసిన ఏబీపీ- సీఓటర్ సర్వేలో తేలింది. అయితే సమాజ్‌వాదీ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది.

ఎవరికెన్నీ సీట్లు..


గోవా ఫలితాలు..

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా అధికారం చేపట్టే అవకాశం ఉందని ఏబీపీ- సీఓటర్ తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో తేలింది. ఎవరికెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే..


మణిపుర్ ఫలితాలు..

మణిపుర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- భాజపా మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని ABP- సీఓటర్ సర్వేలో తేలింది. అయితే కమలదళం కాస్త ముందు ఉంది. ఎవరికెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే..

మొత్తం సీట్లు- 60

భాజపా 21-25
 
కాంగ్రెస్ 17-21

ఎన్‌పీఎఫ్ 6-10

ఇతరులు 8-12

పంజాబ్ ఫలితాలు..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP- సీఓటర్ చేసిన ఒపీనియన్ సర్వే పోల్ ప్రకారం.. కాంగ్రెస్ కంటే ఆప్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24-30, ఎస్‌ఏడీ 20-26, ఆప్ 55-63, భాజపా+ 3-11, ఇతరులు 0-2 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేలింది.


ఉత్తరాఖండ్ ఫలితాలు..

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఒపినీయన్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 31- 37 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 30-36 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీకి 2-4 స్థానాలు గెలవొచ్చు.

కాసేపట్లో ఫలితాలు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. అయితే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రజానాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి ABP-సీఓటర్ ఒపినీయన్ పోల్ నిర్వహించింది. ఆ ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

Background

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? అసలు ప్రజల్లో ట్రెండ్ ఎలా ఉంది? ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌కు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ తాజా ఓపీనియన్ పోల్స్‌ మీరే చూడండి.

గత సర్వే ఫలితాలు..

ఏబీపీ-సీ ఓటర్ గత ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా తిరిగి అధికారం చేపట్టనున్నట్లు తేలింది. గత నాలుగు సర్వే ఫలితాల ప్రకారం భాజపా.. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది.

జనవరి 6న చేసిన సర్వే ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా అధికారం చేపడుతుందని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని 7 శాతం మంది ప్రజలు అన్నారు.

జనవరి 3న చేసిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమకు ముఖ్యమంత్రిగా కావాలన్నారు. 32 శాతం మంది అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు. 15 శాతం మంది మాత్రమే మాయావతి సీఎం కావాలని కోరారు.

పంజాబ్‌లో ఆప్ ముందంజ.. 

పంజాబ్‌లో చేసిన గత సర్వే ప్రకారం 32 శాతం మంది ప్రజలు ఆమ్‌ఆద్మీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 27 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. 11 శాతం మంది మాత్రం.. శిరోమణి అకాలీ దళ్- బహుజన్‌ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమి గెలుస్తుందన్నారు. 

ప్రస్తుతం ఉన్న పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందా? మార్పు కోరుకుంటున్నారా? అని సర్వేలో అడిగిన ప్రశ్నకు 66 శాతం మంది ప్రభుత్వం మారాలని సమాధానమిచ్చారు. 34 శాతం మంది మాత్రం పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని చెప్పలేదు.. అలాగని మళ్లీ ఇదే ప్రభుత్వం కొనసాగాలని చెప్పలేదు.

ఉత్తరాఖండ్‌లో కాషాయం..

ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన గత సర్వే ప్రకారం 40 శాతం మంది ప్రజలు భాజపాకు మద్దతు తెలిపారు. 36 శాతం మంది కాంగ్రెస్‌కు, 13 శాతం మంది ఆమ్‌ఆద్మీకి జై అన్నారు. మరో 11 మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు.

సీట్ల ప్రకారం.. భాజపా 33-39 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 29-35 స్ఖానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా.. ఆమ్‌ఆద్మీ 1-3 సీట్లు గెలవచ్చని సర్వేలో తేలింది.

కాసేపట్లోనే తాజా ఒపినీయన్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి.

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం