ABP News-CVoter Opinion Poll: రాజస్థాన్, గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్- తమిళనాడులో డీఎంకే హవా- ఏబీపీ సీవోటర్ ఒపీనియన్ పోల్
Lok Sabha Elections Opinion Poll 2024: లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ సీఓటర్ ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒపీనియన్ పోల్ విడుదల చేసింది.
LIVE
Background
ABP Cvoter Opinion Poll 2024: న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల జాబితాలు సైతం విడుదల చేస్తున్నారు. బీజేపీ 195 మందితో తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలు విడుదల చేసింది. తొలి జాబితాలో 39 మందికి కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వగా, మార్చి 12న విడుదలైన రెండో జాబితాలో 43 మంది పేర్లు ప్రకటించారు.
ప్రధాని మోదీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. I.N.D.I.A కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తోంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ న్యూస్ సీవోటర్ ఒపీనియన్ పోల్ (ABP News-CVoter Opinion Poll) నిర్వహించింది. ఈ సర్వేలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను పలకరించి అభిప్రాయాలు సేకరించారు.
ABP Cvoter Opinion Poll Live: హర్యానాలో బీజేపీదే ఆధిక్యం
ABP Cvoter Opinion Poll Live: ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం, హర్యానాలోని 10 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకోనుండగా.. కాంగ్రెస్, మిత్రపక్షాలు 2 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది.
హర్యానా మొత్తం సీట్లు-10
బీజేపీ 8
కాంగ్రెస్+2
ఇండియన్ నేషనల్ లోక్ దళ్- 0
ఇతర- 0
ABP Cvoter Opinion Poll Live: హర్యానాలో బీజేపీకే ఎక్కువ ఓట్లు
ABP Cvoter Opinion Poll Live: ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం.. హర్యానాలో బీజేపీకి 52 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 38 శాతం ఓట్లు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 2 శాతం ఓట్లు, ఇతరులు 8 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.
బీజేపీ - 52 శాతం
కాంగ్రెస్+ 38 శాతం
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ - 2 శాతం
ఇతరులు - 8 శాతం
ABP Cvoter Opinion Poll Live: తమిళనాడులో డీఎంకే, ఇండియా కూటమి క్లీన్ స్వీప్
ABP Cvoter Opinion Poll Live: ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి మొత్తం 39 స్థానాల్లో గెలవనుంది. ఏఐఏడీఎంకేకి ఒక్క సీటు కూడా రాదని సర్వేలో వచ్చింది.
తమిళనాడు మొత్తం సీట్లు 39
కాంగ్రెస్, డీఎంకే - 39
BJP+ 0
ఏఐఏడీఎంకే- 0
ఇతర- 0
ABP Cvoter Opinion Poll Live: తమిళనాడులో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి?
ABP Cvoter Opinion Poll Live: ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, మిత్రపక్షాలకు 55 శాతం ఓట్లు రానున్నాయి. BJP కూటమి (NDA) 11 శాతం, ఏఐఏడీఎంకే 28 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో వెల్లడైంది.
తమిళనాడులో ఓట్ల శాతం
బీజేపీ+ 11 శాతం
కాంగ్రెస్, డీఎంకే+ 55 శాతం
ఏఐఏడీఎంకే 28 శాతం
ఇతర 6 శాతం
ABP Cvoter Opinion Poll Live: గుజరాత్‌లో బీజేపీకి అత్యధిక శాతం ఓట్లు
ABP Cvoter Opinion Poll Live: తాజా ఒపీనియన్ పోల్ ప్రకారం.. గుజరాత్ లో అధికార బీజేపీకి 64 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి (I.N.D.I.A) 35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
గుజరాత్‌లో ఓట్ల శాతం
బీజేపీ 64 శాతం
కాంగ్రెస్+ 35 శాతం
ఇతర 1 శాతం