అన్వేషించండి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రకియ గురువారం (జులై 27) సాయంత్రంతో ముగియనుంది.

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి బుధవారం(జులై 26) సాయంత్రంతో ముగియాల్సి గడువును గురువారం (జులై 27) సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ జులై 21న ప్రవేశ ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వివరాలు..

* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు - కాంపిటెంట్ అథారిటీ కోటా

అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నీట్‌ యూజీ-2023 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

నీట్‌ కటాఫ్ మార్కులు కేటగిరీలవారీగా ఇలా..

➥ జనరల్‌ (ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌) - 137 మార్కులు (50 పర్సంటైల్).

➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ, ఎస్సీ/బీసీ (దివ్యాంగులు) - 107 మార్కులు (40 పర్సంటైల్).

➥  ఎస్టీ(దివ్యాంగులు)- 108 మార్కులు (40 పర్సంటైల్).

➥ ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌(దివ్యాంగులు): 121 మార్కులు (45 పర్సంటైల్).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2360 చెల్లించాలి. దీనికి బ్యాంకు ఛార్జీలు అదనం. డెబిట్‌ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్‌బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

ఎంపిక విధానం: నీట్ యూజీ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా.

అవసరమయ్యే డాక్యుమెంట్లు..

  • ఆధార్ కార్డు
  • నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు
  • పదోతరగతి మార్కుల మెమో (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
  • ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల మెమో (క్వాలిఫైయింగ్ ఎగ్జామ్)
  • 6 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు
  • ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా తత్సమాన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ టీసీ)
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లిమ్స్ మాత్రమే)
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్-ఈడబ్ల్యూఎస్ (01.04.2023) తర్వాత జారీచేసినదై ఉండాలి.
  • తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్/ తెల్లరేషన్ కార్డు
  • దివ్యాంగులైతే PwBD సర్టిఫికేట్
  • NCC సర్టిఫికేట్
  • క్యాప్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • పోలీస్ మార్టైర్ చిల్డ్రన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • రెసిడెన్స్ సర్టిఫికేట్(నాన్‌లోకల్ అభ్యర్థులకు)
  • లోకల్ స్టేటస్ సర్టిఫికేట్
  • అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం ఫొటో

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.07.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.07.2023.

Notification

Prospectus

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget