H1B Visa: హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి!
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. భారత్ నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి 'హెచ్-1బీ' సహా కొన్ని కేటగిరీల వీసాల ఫీజులు భారీగా పెంచింది.
H-1B Visa Fee hike: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. భారత్ నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి 'హెచ్-1బీ' సహా కొన్ని కేటగిరీల వీసాల రుసుములను భారీగా పెంచింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. అమెరికా వెళ్లే భారతీయులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారి అని బైడెన్ సర్కారు వెల్లడించింది.
భారీగా పెంపు..
బైడెన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ టెకీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఇక హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచింది. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్నవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ను 1990లో ప్రారంభించారు. కనీసం 10మంది అమెరికా కార్మికులకు ఉద్యోగాలు కల్పించటంతోపాటు కనిష్ఠంగా 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈబీ-5 వీసాలను జారీ చేస్తారు. ఎల్-1 వీసా...కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు జారీ చేస్తారు.
వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఇందుకోసం ఏటా 65 వేల వీసాలతో పాటు మాస్టర్స్డిగ్రీ చేసే వారి కోసం మరో 20వేల వీసాలను మంజూరు చేస్తారు. నాన్ఇమిగ్రేషన్ హెచ్-1బీ వీసాలను పొందేవారిలో ఎక్కువమంది భారతీయులే ఉండటం గమనార్హం. ఈ నాన్- ఇమిగ్రేషన్ వీసాలు అనేవి అమెరికాలో కొంతకాలం ఉండాలనుకునేవారికి ఇస్తారు. వీటిని కంప్యూటరైడ్జ్ లాటరీ విధానంలో ఎంపిక చేసి కేటాయిస్తారు.
బహుళ జాతి కంపెనీలు విదేశాల్లోని తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలంపాటు అమెరికాకు తీసుకొచ్చి పనిచేయించేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్-1బీ వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును ఏప్రిల్ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.
అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్-1బీ వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును ఏప్రిల్ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.
ఎదురుచూడాల్సిన అవసరం లేదు..
భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు.
కాగా, పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్-1బీ వీసాల మొదటి రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగనుంది. ఈలోగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం USCIS ఆన్‌లైన్ అకౌంట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ ఖాతాలను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నాయి. ఫామ్ఐ-129, నాన్- క్యాప్ హెచ్-1బీ పిటిషన్ల కోసం ఫామ్ఐ-907 పత్రాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని USCIS పేర్కొంది.